రజినీకి ముగ్దుడైన పీఎం సాబ్.. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
కూలీ సినిమాతో ఎట్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న రజినీ కాంత్.. తన నట జీవితంలో మరో మైల్ స్టోన్‌ను చేరుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా.. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో ప్రైమ్ మినిస్టర్ మోదీ.. రజినీకి స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ థలైవా రజనీకాంత్‌కి సినీ పరిశ్రమలో 50 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు మోదీ.
అంతేకాదు మీ అభినయం, స్టైల్, విభిన్న పాత్రలతో తరతరాల ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన రజినీ సినీ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం అంటూ మోదీ పేర్కొన్నారు. ఇకపై కూడా ఆరోగ్యం, ఆనందం కలిగిన దీర్ఘాయుష్షుతో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకున్నారు మోదీ. మోదీ మాత్రమే కాదు.. సినీ – రాజకీయ ప్రముఖులు కూడా రజినీ సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో.. ఆయన్ను విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూనే ఆయనను కీర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరో కొడుకు కోసం.. ముగ్గురు హీరోయిన్లు?
కూలీ సక్సెస్ ఎఫెక్ట్.. కోట్లు విలువ చేసే కారుకొన్న హీరో..
‘కింగ్ అయినా.. అనుబంధాలకు బానిసే!’ షోలో కన్నిళ్లు పెట్టుకున్న నాగ్..
‘ప్రేమ కథల్లో ఈ ప్రేమ కథ వేరయా..’ ఆకట్టుకుంటున్న ఒక పార్వతి.. ఇద్దరు దేవదాసులు