రజనీకాంత్‌కు గుడికట్టి పూజలు చేస్తున్న ఫ్యాన్.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Updated on: Sep 22, 2025 | 6:20 PM

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయనను దేవుడిగా భావించి పూజలు చేసేంతగా అభిమానించేవారూ ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ ఫ్యాన్‌ తన అభిమాన హీరో రజనీకాంత్‌ కోసం కొన్ని రోజుల క్రితం ఓ గుడి కట్టాడు. ప్రతిరోజూ రజనీ విగ్రహానికి పూజలు చేస్తున్నాడు.

తాజాగా శరన్నవరాత్రులు సందర్భంగా ఏకంగా రజనీకి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. తమిళనాడు మధురైకి చెందిన కార్తీక్ అనే వ్యక్తికి రజనీకాంత్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. వయసుతో బాటే అతని అభిమానమూ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతడు తన అభిమాన హీరోమీద ప్రేమతో కొన్ని నెలల క్రితం ఓ చిన్న గుడిని నిర్మించాడు. అందులో రజనీకాంత్ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నాడు. అయితే, నవరాత్రుల సందర్భంగా.. ఈసారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశాడు. తాను నిర్మించిన రజనీ గుడిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు. ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఏర్పాటు చేశాడు. వాటిని 15 వరసల్లో చక్కగా అమర్చాడు. అలాగే, 10 వరుసల్లో రజనీ టాప్ ఫొటోలు ఉన్నాయి. ఇక, నవరాత్రి సందర్భంగా కార్తీక్ రోజూ ఆ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేయనున్నాడు. ప్రస్తుతం తలైవా గుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రజనీ విగ్రహం, ఫొటోలకు కార్తీక్ హారతి ఇస్తూ ఉన్నాడు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు కార్తీక్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తలైవా ఫ్యాన్స్ గ్రేట్ అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.300 కోట్లతో దుర్గా మండపం.. ఎక్కడో తెలుసా

రూ. 150కే కార్టన్ బీర్లు, మేకపోతు.. బంపర్ ఆఫర్ అంటే ఇదే బాస్

పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా

బాలాత్రిపురసుందరిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం

పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

Published on: Sep 22, 2025 05:51 PM