COOLIE Pre-Release Event: రజినీకాంత్ కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Cooli

COOLIE Pre-Release Event: రజినీకాంత్ కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

Updated on: Aug 04, 2025 | 1:14 PM

రజనీకాంత్ వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా అన్నీ ఇండస్ట్రీలకు చెందిన హీరోలందరూ రజనీని అమితంగా అభిమానిస్తారు. ఆరాధిస్తారు

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న కూలీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా కూలి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్.

 

Published on: Aug 04, 2025 01:13 PM