నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్ ఇచ్చిన రజినీ

Updated on: Feb 05, 2026 | 9:11 AM

సూపర్‌స్టార్ రజినీకాంత్ పారిశుధ్య కార్మికురాలు పద్మ నిజాయితీని గుర్తించి, ఆమెకు బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. 45 తులాల బంగారం దొరికినా పోలీసులకు అప్పగించిన పద్మను తలైవా ఇంటికి పిలిచి సత్కరించారు. భారత తపాలా శాఖ, తమిళనాడు ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించాయి.

సిల్వర్ స్క్రీన్‌పై తన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకునే రజినీకాంత్, నిజ జీవితంలో తన అభిమానుల నిజాయితీ, నిబద్ధతలకు ఫిదా అవుతుంటారు. పేదల కడుపు నింపుతున్న పరోటా వ్యాపారిని గతంలో సత్కరించిన తలైవా, ఇప్పుడు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ నిజాయితీకి గౌరవం ఇచ్చారు. చెన్నై నగరంలో 45 తులాల బంగారం దొరికినా, పద్మ దానిని వెంటనే పోలీసులకు అప్పగించారు. ఈ నిజాయితీకి తమిళ ప్రజల ప్రశంసలు దక్కాయి. ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్, పద్మను తన ఇంటికి ఆహ్వానించి, ఆప్యాయంగా మాట్లాడి ఆమెకు బంగారు గొలుసును బహుమతిగా అందించారు. రజినీ ఆమెతో కలిసి భోజనం చేసి, స్వయంగా వడ్డించారు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో