మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా.. !
సినిమాల్లో కామెడీ చేసి నవ్వించే రాజేంద్ర ప్రసాద్.. ఇటీవలి కాలంలో బహిరంగ వేదికల మీద తన మాటతీరుతో .. అందరికీ కోపం తెప్పిస్తున్నాడు. తరుచూ తన దైన శైలిలో నోరు జారుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ... నెట్టింట వైరల్ అవుతున్నాడు. తాజాగా మరోసారి అలాగే సరదాగా మాట్లాడుతూ..మన తెలుగు వారైన దివంగత మాజీ ప్రధానీ పీవీ నరసింహ రావు తనతో చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నాడు.
ఇక రీసెంట్‌గా తానా 24వ మహాసభలకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్.. ఎప్పటిలానే స్టేజ్‌పై హుషారుగా తన ఉపన్యాసం మొదలెట్టాడు.ఇంతమంది తెలుగువారిని అమెరికాలో చూస్తే.. ఇది డెట్రాయిటా? లేక బెజవాడా? అనే అనుమానం వస్తోందన్నారు. అమెరికాలో తనను కలిసిన ఓ వ్యక్తి.. ‘మేమంతా నీ వల్లే కాస్త మనశ్శాంతిగా బతికేస్తున్నాం’ అన్నాడని చెప్పుకొచ్చాడు. అదేంటని అడిగితే, అమెరికా వచ్చి ఉరుకులు పరుగులు జీవితం గడిపే క్రమంలో అనేక సార్లు ఉద్యోగం మానేసి ఇంటికి పోవాలని అనిపించిందని, అలాంటి సమయాల్లో మీ సినిమాలు చూసి కాస్త రిలాక్స్ అవుతున్నామని చెప్పినట్లు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించాడు మన రాజేంద్రుడు. ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే..‘ఈ మాట అన్నది ఆ ఉద్యోగం చేసే కుర్రాడే కాదు.. మన మాజీ ప్రధాని పీవీ గారు కూడా ఇలానే అన్నాడు’ అని గుర్తుచేసుకున్నాడు. సూట్ కేసులు.. కేసులు..ఇలా బోలెడు తలనొప్పుల మధ్య పీవీ తన సినిమాలు చూసి రిలాక్స్ అయ్యారని వివరించారు. అయితే పీవీ గురించి ప్రస్తావించేటప్పుడు సూటుకేసులు.. కేసులు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పడం చాలా మందికి ఇప్పుడు నచ్చట్లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అతను చనిపోవడమే బెటర్..’ ఉదయ్ చావుపై కౌషల్ షాకింగ్ కామెంట్స్
ఆలియాకు టోకరా వేసిన PA.. పోలీసులకు పట్టించిన హీరోయిన్
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్