Varanasi: రెండు భాగాలుగా రానున్న వారణాసి.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
రాజమౌళి బాహుబలితో రెండు భాగాల ట్రెండ్ మొదలుపెట్టినా, RRRను ఒకే పార్ట్‌లో ముగించారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం 'వారణాసి' గురించి చర్చ నడుస్తోంది. ట్రైలర్ చూస్తే కథ చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఇది బాహుబలిలా రెండు భాగాలుగా వస్తుందా లేదా RRRలా ఒకే పార్ట్‌లో ఉంటుందా అనే అనుమానాలు ప్రేక్షకులలో ఉన్నాయి. భారీ బడ్జెట్, టైమ్ ట్రావెల్ కథాంశం ఒకే చిత్రంలో సాధ్యమేనా?
బడ్జెట్ పెరిగినా.. కథ స్పాన్ పెరిగినా ఒకప్పుడు నిర్మాతలకు కంగారు ఎక్కువయ్యేది. కానీ ఇప్పుడలా కాదు.. సింపుల్‌గా ఒక సినిమాను రెండు భాగాలు చేస్తున్నారు.. అడిగితే కథ పెద్దదైపోయిందంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసిందే రాజమౌళి. ట్రిపుల్ ఆర్ సింగిల్ పార్ట్‌గానే ముగించిన ఈయన.. వారణాసిని అలాగే చేస్తారా..? ఇంత పెద్ద కథను సింగిల్ పార్ట్‌లో చెప్పగలరా..? బాహుబలితో ఇండియన్ సినిమాకు 2 పార్ట్ కల్చర్ పరిచయం చేసారు రాజమౌళి.. ఆ తర్వాత చాలా సినిమాలు రెండు భాగాలుగా వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి కూడా. ఓ రకంగా నిర్మాతలకు ధైర్యాన్నిచ్చిన ట్రెండ్ ఇది. కానీ దీన్ని ట్రిపుల్ ఆర్‌కు కంటిన్యూ చేయలేదు జక్కన్న. 3 గంటలైనా ఒకే సినిమాతో ఈ కథను ముగించారు. ఇద్దరు స్టార్ హీరోలున్నా కూడా ట్రిపుల్ ఆర్ కథను పర్ఫెక్టుగానే ముగించారు రాజమౌళి. తాజాగా ఈయన ఫోకస్ అంతా వారణాసి సినిమాపైనే ఉంది. ఇన్నాళ్లూ ఈ సినిమాను ఒకే పార్ట్‌లో చెప్తారనుకున్నారు ఆడియన్స్. మేకర్స్ ఇప్పటికీ అదే చెప్తున్నారు కూడా.. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ చూసాక ఇంత పెద్ద సినిమాను ఒకే పార్ట్‌లో రాజమౌళి చెప్పగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పారు రాజమౌళి. ముఖ్యంగా ఆయన చెప్పాలనుకున్న కథను ఈ వీడియోతో చెప్పారు. టైమ్ ట్రావెల్ కథగా ఇది వస్తుంది. ఇందులో రామాయణంతో పాటు ఇంకా చాలా పీరియడ్స్ ఉన్నాయి.. కాశీ మహానగరం చుట్టూ తిరిగే కథ ఇదని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది.. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. రాజమౌళి విజన్, విడుదలైన వీడియో చూసాక.. కచ్చితంగా ఈ కథను ప్రాపర్ రెండున్నర గంటల్లో అయితే చెప్పలేరు.. 3 గంటలు కూడా తక్కువే. బాహుబలి ఎపిక్‌లా 3.45 గంటలైనా కావాల్సిందే. మరి అంత తీస్తారా లేదంటే మధ్యలో మనసు మార్చుకుని 2 పార్ట్ సినిమాగా మార్చేస్తారా అనేది ఆసక్తికరమే. ఇప్పటికైతే ఇది ఒకే పార్ట్.. 2027 సమ్మర్ విడుదల అంటున్నారు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: