Director Maruthi: ఈవెంట్లో అడ్రస్ చెప్పిన పాపానికి మారుతికి స్వీట్ షాకిచ్చిన అభిమాని

Updated on: Jan 01, 2026 | 12:40 PM

రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మారుతి తన ఇంటి అడ్రస్ చెప్పిన తర్వాత, ఓ అభిమాని ఆయనకు బిర్యానీ పంపించాడు. ఈ అనూహ్య బహుమతికి షాకైన మారుతి, సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబు చలాన్ల ఘటన తర్వాత, ఇది మరోసారి అభిమానుల విచిత్రమైన ప్రేమను చాటింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ మధ్య ఫ్యాన్స్ అందరూ క్రేజీగా తయారవుతున్నారు. మొన్నామధ్య మహేష్ కారు పెండింగ్ చలాన్లను ఆయన ఫ్యాన్ కట్టేస్తే.. ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్ ఏకంగా మారుతీ ఇంటికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపాడు. తన ఈ క్రేజీ థింగ్‌తో మారుతీని నోరెళ్లబెట్టాలా.. ట్వీట్ చేశాలా చేశాడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇటీవలే జరిగిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజా సాబ్ సినిమా ఒక వేళ మీకు నచ్చకపోతే.. నేరుగా నా ఇంటికి వచ్చి చెప్పేయచ్చు అంటూ అదే ఎమోషనల్‌గా తన ఇంటి అడ్రస్ చెప్పేశాడు. ఇక ఈ అడ్రస్‌ ను నోట్ చేసుకున్న ఓ రెబల్ ఫ్యాన్… ఈయన ఇంటికి స్పెషల్ బిర్యానీ పాట్స్‌ను గిఫ్ట్ గా పంపాడు. ఆ బిర్యానీ పార్సిల్స్‌ను చూసి షాకైన డైరెక్టర్ మారుతీ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసుకున్నాడు. “డార్లింగ్స్ మాటల్లో చెప్పలేను… ఇంటికి వచ్చిన వెంటనే దీన్ని చూసి ఆశ్చర్యపోయాను. బిర్యానీని పంపినందుకు ధన్యవాదాలు. జనవరి 9న మీకు నేను మరింత ఇస్తాను ” అంటూ రాసుకొచ్చారు మారుతి. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్

Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్‌.. ఇండియాకొస్తే బొక్కలోకే