Rahul Sipligunj: హైదరాబాద్ చేరుకున్న రాహుల్ కు ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్.. వీడియో.

|

Mar 19, 2023 | 9:41 AM

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సాంగ్‌ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ తరువాత సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్కార్ వేదిక పై ఈ నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్,

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సాంగ్‌ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ తరువాత సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్కార్ వేదిక పై ఈ నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఆస్కార్‌ ఆవార్డ్‌ తర్వాత హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి రాహుల్ సిప్లి గoజ్ అభిమానుల భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ ఇంటి వద్ద అభిమానుల హంగామా చేశారు. అభిమానులు గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లీగంజ్‌ టీవీ9తో మాట్లాడుతూ.. జీవితంలో ఇలాంటి మూమెంట్‌ వస్తుందని అనుకోలేదని, కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. 18నెలల కష్టానికి ఫలితం దక్కిందని, ప్రతి ఒక్కరి ట్వీట్‌ ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 19, 2023 09:41 AM