Rahul Sipligunj: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందో లేదో.. అప్పుడే ప్రత్యేక పూజలు..

Updated on: Aug 22, 2025 | 8:47 PM

అటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కానీ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగా కానీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పీక్ స్టేజ్‌ లో ఉన్నాడని నెటిజన్లు అంటున్నారు. ముందు ప్రైవేట్‌ సాంగ్స్‌తో యూట్యూబ్ లో బాగా వైరల్‌ అయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు. ఇక ట్రిపుల్‌ ఆర్‌లో పాడిన నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌ రావడంతో ఈ హైదరాబాద్ బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోందని గుర్తు చేస్తున్నారు.

ఇక పర్సనల్ లైఫ్ పరంగానూ… తన మనసుకు నచ్చిన అమ్మాయితో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని చెబుతున్నారు. కానీ ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్ ఏమి చెప్పినా సరే.. అంతా దేవుడి దయే అన్నట్టు.. తన ఎంగేజ్‌ మెంట్ అయిపోగానే ప్రత్యేక పూజలు చేశాడు ఈ బస్తీ బాబు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్‌. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక ఆఫ్టర్ ఎంగేజ్‌ మెంట్ … కన్యాకుమారికి వెళ్లిపోయాడు రాహుల్ సిప్లిగంజ్. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీస లో షేర్ చేశాడు. నిశ్చితార్థం వేదికపై ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు రాహుల్- హరిణ్య. ఇద్దరూ కలిసి డ్యాన్సులు చేశారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఇక చివరిగా ఇదే వేదికపై కాబోయే భార్యకు కాస్ట్‌లీ హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చాడు రాహుల్. కట్ చేస్తే.. ఆ మరుసటి రోజు ఇలా ప్రత్యేక పూజలు చేస్తూ.. తన ఫ్యాన్స్‌ పోస్టులతో నెట్టింట వైరల్ అవుతున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. గుడి నుంచి గెంటేసిన అర్చకులు

కోపంగా ఉన్న ఫ్యాన్స్‌ను.. చిరు లీక్‌తో కూల్ చేసిన మెగాస్టార్

Sitara Ghattamaneni: అభిమానులకు.. మహేష్ కూతురు హెచ్చరిక

మరీ దారుణం.. కలిచివేస్తున్న కమెడియన్ కథ!

Samantha: పిచ్చెక్కించిన సమంత ‘కానీ ఇంత ఓవర్ అవసరమా..’ అన్నదే టాక్