మాలీవుడ్‌లో పుష్పా లాంటి సినిమా.. హీరో అతనే

Edited By: Phani CH

Updated on: Nov 08, 2025 | 1:29 PM

పాన్ ఇండియా సెన్సేషన్‌ పుష్ప క్రేజ్‌ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే ఆ టోన్‌లో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు కూడా ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. తాజాగా ఓ మలయాళ స్టార్ హీరో పుష్ప లాంటి కథతో ఆడియన్స్‌ ముందుకు రాబోతున్నారు. ఎవరా హీరో ఏంటా సినిమా ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప పుష్ప రాజ్ అంటూ పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.

ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఈ మూవీ తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించింది. బాహుబలి తరువాత ఆ సినిమాను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించినట్టే.. ఇప్పుడు పుష్ప ను ఇమిటేట్ చేస్తూ సినిమాలు వస్తున్నాయి. మాలీవుడ్‌ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పుష్ప లాంటి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. విలాయత్‌ బుద్ధ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పృథ్వీరాజ్‌. ఈ సినిమాలో గందపు చెక్కల స్మగ్లర్‌ డబుల్‌ మోహనన్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పుష్ప కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందన్న విషయంన్ని టీజర్‌లోనే క్లారిటీ ఇచ్చారు. ‘నువ్వేమన్న పుష్ప అనుకుంటున్నావా’ అంటే ‘అయ్యో… కాదు ఆయన ఇంటర్నేషనల్… నేను లోకల్’ అంటూ ఆడియన్స్‌కు మరోసారి పుష్పరాజ్‌ను గుర్తు చేశారు. చిన్న సైజ్‌ వీరప్పన్ అంటూ కథ ఏంటన్నది ముందే రివీల్ చేసిన మేకర్స్, నవంబర్‌ 21 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి మన పుష్పరాజ్‌ రేంజ్‌లో మలయాళ పుష్ప కూడా బజ్‌ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ

Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..

ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు

నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను

ఆమె అప్పుడు హైదరాబాదీ.. ఇప్పుడు అమెరికాలో వర్జీనియా గవర్నర్

Published on: Nov 08, 2025 01:29 PM