రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

Updated on: Jan 25, 2026 | 8:07 PM

సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు (SKN) సోషల్ మీడియాలో సినీ నటీనటులపై జరుగుతున్న అసభ్యకరమైన పోస్టులు, 'ది రాజా సాబ్' సినిమాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 23న హైదరాబాద్‌లో దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో, తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి సినిమా, నటీనటుల ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని SKN పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సినీ నటీనటులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లపై సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనవరి 23న ఆయన ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, దీనివల్ల ది రాజా సాబ్ సినిమా యూనిట్‌తో పాటు నటీనటుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి, ది రాజా సాబ్ సినిమా మరియు అందులోని నటీనటులను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాత SKN కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి

‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్‌ కామెడీకి.. రిబ్బన్ కట్ చేసిన శర్వా..

Akira Nandan: తండ్రిని ఫాలో అవుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు