Bunny Vas: ఆ ఒక్క సినిమా వల్ల ఏకంగా 6 కోట్లు నష్టపోయా

Updated on: Jan 01, 2026 | 12:46 PM

నిర్మాత బన్నీ వాస్ 'మిత్రమండలి' చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా వల్ల తనకు 6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఎడిటింగ్, ఆర్‌ఆర్ లోపమే దీనికి కారణమని, చివరి నిమిషంలో తాను అందుబాటులో లేకపోవడం వల్లే లోపాలు సరిదిద్దలేకపోయానని బన్నీ వాస్ అంగీకరించారు. 100% బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

తెలుగులో నిర్మాతగా రాణిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత బన్నీ వాస్. హిట్స్ ఫ్లాప్స్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు బన్నీ వాస్. ఈ ఏడాది తన నిర్మాణంలో వచ్చిన మిత్రమండలి చిత్రం గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాస్ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ప్రొడ్యూస్ చేసిన మిత్రమండలి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలా బోల్తా కొట్టిందనే విషయాన్ని డీ కోడ్ చేశారు. దాంతో పాటే తనకు ఎన్ని కోట్లు నష్టం వచ్చిందనేది కూడా బయట పెట్టాడు ఈ స్టార్ డైరెక్టర్. ఈ సంవత్సరం తండేల్ నుంచి ఈషా వరకు పలు విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో పాలుపంచుకున్న బన్నీ వాస్‌కు మిత్రమండలి నిరాశను మిగిల్చింది. తాను, ఇతర నిర్మాతలు కలిసి మిత్రమండలికి పెట్టుబడి పెట్టామని, చిత్రంలో వినోదానికి లోటు ఉండదని గట్టిగా నమ్మామని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఎడిటింగ్ రూమ్‌లో సినిమాను చూసినప్పుడు తామంతా చాలా సంతోషంగా ఉన్నామని, దర్శకుడు వంశీ కూడా చిత్రాన్ని చూసి సినిమా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అయితే, థియేటర్లలో ప్రేక్షకుల స్పందన తమ అంచనాలకు రివర్స్ లో ఉందని బన్నీ వాస్ ఒప్పుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత, తాను థియేటర్లలో చిత్రాన్ని చూస్తున్నప్పుడు, సాధారణంగా ప్రేక్షకులు ఎక్కడ నవ్వుతారని తాను మార్క్ చేసుకున్నానో.. అక్కడ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏదో లోపం జరిగిందని అర్ధమైందని బన్నీ వాసు అన్నారు. ఈ లోపం ఎడిటింగ్, ముఖ్యంగా ఆర్‌ఆర్ లో జరిగిందని తాను గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పొరపాటు తనదేనని 100 శాతం బాధ్యత తీసుకున్నారు. చివరి మూడు రోజులు తాను ఊరిలో ఉండడం వల్ల ఫైనల్ కాపీని చూడలేకపోయాను అన్నారు. మిక్సింగ్ థియేటర్‌లో సరిదిద్దగలిగే ఈ చిన్న లోపాన్ని తాను చూసి ఉంటే తప్పకుండా సరిదిద్దేవాడినని బన్నీ వాస్ చెప్పారు. ఈ సినిమా వల్ల మొత్తం రూ. 6 కోట్ల నష్టం వచ్చిందని ఆయన రివీల్ చేశారు. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Director Maruthi: ఈవెంట్లో అడ్రస్ చెప్పిన పాపానికి మారుతికి స్వీట్ షాకిచ్చిన అభిమాని

Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్

Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్‌.. ఇండియాకొస్తే బొక్కలోకే