Loading video

ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌

|

Mar 24, 2025 | 3:54 PM

టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మోస్ట్ అవేటెడ్ మూవీ SSMB 29. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టుగా న్యూస్. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ - అడ్వెంచరస్‌ జానర్లో సాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

దాంతో పాటే రామాయణ, సంజీవని పర్వత ఘట్టంలోని హనుమంతుడి క్యారెక్టర్‌ నుంచి స్ఫూర్తి పొంది ఈసినిమాలోని మహేష్‌ పాత్రను మలిచినట్టుగా రీసెంట్‌ గా ఓ లీక్ బయటికి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ తాను ఎప్పుడు జాయిన్‌ అయ్యాననేది బయటపెట్టారు ఈ మూవీలో కీ రోల్ చేస్తున్న పృథ్వీ సుకుమారన్. తాను డైరెక్షన్‌ చేసిన ఎల్ 2 ఎంపురాన్ సినిమా మార్చ్‌ 27న రిలీజ్‌ కానుంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లో హీరో మోహన్‌ లాల్‌తో పాటు పాల్గొని తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్న పృథ్వీ రాజ్‌… ఓ రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు ssmb29 గురించి షాకింగ్ విషయం చెప్పాడు. SSMB29 లీక్ వీడియోలు చూడటంలో అంత ఆసక్తి ఏముంటుంది. బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తే ఫీల్ డబుల్ ఉంటుందని అన్నాడు పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌. అంతేకాదు రాజమౌళి సినిమాలో తాను ఏడాది క్రితమే భాగమయ్యానని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని.. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేనంటూ ఆ తర్వాత మాట దాటేశారు ఈ హీరో కమ్ డైరెక్టర్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!