Prabhas: ఒకేసారి రెండు సినిమాలు.. బ్యాలెన్స్ చేస్తున్న డార్లింగ్
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్‌తో డిలేలకు తావు లేకుండా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ప్రభాస్ ప్రత్యేకంగా సిద్ధమవుతుండగా, ‘ఫౌజీ’ షూటింగ్‌ను కూడా సమాంతరంగా పూర్తి చేసేలా డేట్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ‘స్పిరిట్’, అనంతరం ‘కల్కి 2’పై ఫోకస్ పెట్టనున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ అప్‌డేట్స్ సోషల్ మీడియాను రూల్ చేస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ విషయంలో డైరెక్టర్ తీసుకుంటున్న డెసిషన్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం టీమ్ ఎలాంటి ప్లాన్స్ చేస్తోంది. షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్పిరిట్ షూటింగ్, బ్రేక్ లేకుండా జరుగుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి సినిమాల షూటింగ్స్ చాలా డిలే అయ్యాయి. కానీ స్పిరిట్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. సందీప్ పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్‌తో సెట్స్‌పైకి వెళ్లడంతో శరవేగంగా షెడ్యూల్స్ పూర్తవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్, యాక్షన్ సీక్వెన్స్‌లు నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. డూప్ వాడకూడదని సందీప్ ముందే కండిషన్ పెట్టడంతో ప్రభాస్ కూడా యాక్షన్ సీన్స్ కోసం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యారు. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ వర్క్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు డార్లింగ్. షెడ్యూల్స్ డిస్ట్రబ్ అవ్వకుండా రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. మరో నెల రోజలు పాటు స్పిరిట్ సెట్‌లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్న డార్లింగ్, ఆ తరువాత ఫౌజీ టీమ్‌తో జాయిన్ అవుతారు. నెక్ట్స్ షెడ్యూల్‌లో ఫౌజీ వర్క్ దాదాపుగా పూర్తికానుంది. ఫౌజీ పూర్తయిన తరువాత ఎలాంటి డీవియేషన్ లేకుండా ఫుల్ టైమ్ స్పిరిట్‌కే కేటాయించేలా పక్కాగా డేట్స్ ప్లాన్ చేశారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే కల్కి 2 సెట్‌లో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా
వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..
