Salaar – Adipurush: ఇప్పుడు రాక్షసుడే.. రాముడికి కొండంత అండ.! సాలార్ టీజర్ చెప్తుంది..
ప్రభాస్! నిన్న మొన్నటి వరకు.. జెస్ట్ రీజనల్ సినిమాల యాక్షన్ హీరో..! కానీ బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ హీరో..! అందులోనే.. తను చేసే సినిమాల కారణంగా.. అందులో చేసే రోల్స్ కారణంగా.. అయ్యారు వర్సటైల్ హీరో.! ఎందుకంటే.. వేయి మందినైనా అటు తన మంచి తనంతో..
ప్రభాస్! నిన్న మొన్నటి వరకు.. జెస్ట్ రీజనల్ సినిమాల యాక్షన్ హీరో..! కానీ బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ హీరో..! అందులోనే.. తను చేసే సినిమాల కారణంగా.. అందులో చేసే రోల్స్ కారణంగా.. అయ్యారు వర్సటైల్ హీరో.! ఎందుకంటే.. వేయి మందినైనా అటు తన మంచి తనంతో.. ఇటు కండ బలంతో ఓడించే బాహుబలిలా కనిపించిన ప్రభాస్.. ఆ వెంటనే.. ఫక్తు కమర్షియల్ యాక్షన్ థీఫ్‌గా.. సాహోలో కనిపించారు. ఇక ఆ వెంటనే లవర్ బాయ్ రాధేశ్యామ్‌లా.. కూల్ అండ్ కామ్ గా కనిపించారు. ఇక తరువాతే పురాణ పురుషుడిగా.. ఆ రఘురాముడిగా.. మనకు దర్శనమిచ్చారు. ఇక ఇప్పుడు మాఫియా ముఠాలనే ఏలేటోడిగా… మాన్‌స్టర్ సలార్‌గా.. మన ముందుకు వస్తున్నారు. తాజాగా చిన్న టీజర్‌తోనే.. ఇండియన్ సినిమాస్ దగ్గర రాముడిగా చేయలేని వండర్స్‌ను.. రాక్షసుడిగా చేసేస్తున్నారు. దాంతో పాటే.. రాముడి సినిమా బయ్యర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు కొండంత అండగా మారబోతున్నారట. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేసిన ఆదిపురుష్ మూవీ… బాక్సాఫీస్ సైలెంట్ అయిపోయింది. దాదాపు 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ… జెస్ట్ 500 కోట్ల కలెక్షన్స్ దగ్గరే ఆగిపోయింది. తెలుగు టూ స్టేట్స్లో కలుపుకుని.. త్రూ అవుట్ ఇండియా చాలా చోట్ల.. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లను.. బయ్యర్లను.. నష్టపోయేలా చేసింది.
అయితే ఆదిపురుష్ కారణంగా నష్టపోయిన వారికే.. తన పాన్ ఇండియన్ యాక్షన్ ఫిల్మ్ సలార్ రైట్స్‌ను ఇవ్వాలని అనుకుంటున్నారట ప్రభాస్. ఇదే విషయంగా.. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొదలెట్టిన హోంబలి ప్రొడక్షన్స్తో మాట్లాడుతున్నారట. ఎలాగైన అడ్వాన్స్ రూపంలోనో.. ఆఫర్ రూపంలోనో… సలార్ రైట్స్ ఇప్పించి.. వారిని ఆదిపురుష్ నష్టాల నుంచి ఆదుకోనున్నారట. ఇక ఇదే లీక్ ఇప్పుడు ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాతో పాటు.. నేషనల్ మీడియా వరకు పాకి… త్రూ అవుట్ ఇండియా తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...