Prabhas – Adipurush: ప్రభాస్ కు బాలీవుడ్ సలాం..! హిందీలో మనవాడే హైలెట్..

|

Jun 28, 2023 | 9:33 AM

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పై క్రేజీ కామెంట్స్ చేసిన వేళ..! ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్సే.. బాలీవుడ్ హిట్ సినిమాల కలెక్షన్స్ అంటూ.. తాజాగా చెప్పిన వేళ..! మరో సారి బాలీవుడ్లో ఒక్క సారిగా వైరల్ అయ్యారు ప్రభాస్.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పై క్రేజీ కామెంట్స్ చేసిన వేళ..! ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్సే.. బాలీవుడ్ హిట్ సినిమాల కలెక్షన్స్ అంటూ.. తాజాగా చెప్పిన వేళ..! మరో సారి బాలీవుడ్లో ఒక్క సారిగా వైరల్ అయ్యారు ప్రభాస్. ఇక దాంతో పాటే ఆదిపురుష్.. బాలీవుడ్లో బ్రేక్ ఈవెన్ రీచ్ అయిందనే న్యూస్ కూడా బయటి రావడంతో.. మనోడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎస్ ! ఇప్పటికే సాహోతో.. బాలీవుడ్‌లో తన కలెక్షన్స్ కెపాపిటీ ఏంటో చూపించిన ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ విషయంలో కూడా అదే చేశారు. మోస్ట్ అవేటెడ్ మూవీగా.. తెరకెక్కి.. రీసెంట్‌గా రిలీజ్ అయి.. త్రూ అవుట్ ఇండియా… మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ.. బాలీవుడ్ లో లాభాల బాట పట్టింది. అక్కడి ప్రొడ్యూసర్లకు.. డిస్ట్రీబ్యూటర్లకు దిమ్మతిరిగే లాభాలు వచ్చేలా చేసింది.

ఇక అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ 75కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోగా.. తాజాగా ఈ సినిమా దాదాపు 73కోట్లను రాబట్టింది. ఇక ఓవర్ ఆల్‌గా అయితే..బాలీవుడ్ గడ్డపై ఆదిపురుష్ మూవీ ఇప్పటి వరకు 140కోట్ల నెట్ బిజినెస్ చేసింది. ఇప్పుడిదే న్యూస్ అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ప్రభాస్‌కు బాలీవుడ్ సలాం కొడుతోంది అనే కామెంట్ సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..