మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! ‘ఫార్మా’ సిరీస్ రివ్యూ
ప్రతీ ఓటీటీల్లో కుప్పలు తెప్పలుగా సీరిస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది చూడాలి.. ఏది ఎలా ఉంటుందో తెలుసుకుని చూడాలనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. వారి కోసమే ఈ మలయాళీ సరీస్ రివ్యూ. ఒక వేళ రివ్యూ నచ్చితే.. ఫుల్ సిరీస్ పై ఓ లుక్కేయండి. నివిన్ పౌల్ హీరో.. పీఆర్ అరుణ్ డైరోక్షన్లో వచ్చిన సిరీస్ ఫార్మా. ఫార్మా రంగంలోని లోటు పాట్లను ఎత్తి చూపుతూ ఇంట్రెస్టింగ్ సాగుతుంది ఈ సిరీస్.
ప్రతీ ఓటీటీల్లో కుప్పలు తెప్పలుగా సీరిస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది చూడాలి.. ఏది ఎలా ఉంటుందో తెలుసుకుని చూడాలనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. వారి కోసమే ఈ మలయాళీ సరీస్ రివ్యూ. ఒక వేళ రివ్యూ నచ్చితే.. ఫుల్ సిరీస్ పై ఓ లుక్కేయండి. నివిన్ పౌల్ హీరో.. పీఆర్ అరుణ్ డైరోక్షన్లో వచ్చిన సిరీస్ ఫార్మా. ఫార్మా రంగంలోని లోటు పాట్లను ఎత్తి చూపుతూ ఇంట్రెస్టింగ్ సాగుతుంది ఈ సిరీస్. ఇక ఈ సిరీస్ కథలోకి వెళితే.. కేపీ వినోద్ అలియాస్ నివిన్ పౌల్.. ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ఎన్నో ఆశలతో మరెన్నో గోల్స్‌తో ఈ ఉద్యోగంలో చేరినా కూడా.. మొదట్లో కుదురకోడానికి కష్టపడుతుంటాడు. తన తోటి వారితో పోలిస్తే వెనకే ఉండిపోతుంటాడు. ఈక్రమంలోనే తను పని చేస్తున్న RX ఫార్మా.. గర్భిణిల కోసం కైడాక్సిన్ అనే మందు కనిపెడుతుంది. దీని సేల్స్ పెంచడంలో మన హీరో కీ రోల్ ప్లే చేస్తాడు. టార్గెట్ మించి సేల్స్ చేస్తాడు. కానీ ఈ మందు వల్ల పుట్టిన పిల్లలందరూ షుగర్ బారిన పడ్డారని డాక్టర్ శైలజ అలియాస్ శ్రుతి రామచంద్రన్ కి తెలుస్తుంది. ఇదే విషయం వినోద్‌కి చెబుతుంది. దీంతో ఉద్యోగం చేసిన కంపెనీపైనే న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? డాక్టర్ రాజీవ్ రావు అలియాస్ రజత్ కపూర్.. వినోద్‌కి ఎలాంటి సాయం చేశారనేది మిగతా స్టోరీ. ఇదో కల్పిత కథతో తీసిన సిరీస్. చూస్తున్నంతసేపు బయట హాస్పిటల్స్‌లోనూ ఇలానే జరుగుతుందా అనే సందేహం, మరోవైపు చిన్నపాటి భయం వేస్తుంది. మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు. కొందరు వ్యక్తులు టక్, షూ వేసుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని హాస్పిటల్స్‌లో అప్పుడప్పుడు కనిపించడం మీరు చూసే ఉంటారు. వీళ్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వీళ్ల చేసే పని ఏంటంటే.. ఫార్మా కంపెనీ తయారు చేసిన మందులు, మెడికల్ పరికరాలని ప్రతి ఊరిలో ఉండే డాక్టర్లు, ఆసుపత్రులు, ఫార్మాసిస్ట్‌లకు పరిచయం చేసి అమ్మడం. అసలు వీళ్లు ఎలా పనిచేస్తారు? ఎంతలా కష్టపడతారు? టార్గెట్స్ పేరు చెప్పి వీళ్లతో కంపెనీ ఎలాంటి పనులు చేయిస్తాయి? లాంటి విషయాల్ని ఈ సిరీస్‌లోని కేపీ వినోద్ పాత్రతో చాలా చక్కగా చూపించారు. కొన్ని ఫార్మా కంపెనీలు.. బిజినెస్సే ముఖ్యమనుకుని ప్రజల ప్రాణాలతో ఎలా చెలాగాటం ఆడుతున్నాయి? ఆయా సంస్థల నుంచి వచ్చే మెడిసన్ వల్ల భవిష్యత్తు తరాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది. ఎంతో ప్రమాదకరమైన మందులు.. ప్రజల్లోకి ఎంత తేలికగా వచ్చేస్తున్నాయనే అంశాలని ఈ సిరీస్‌లో పూసగుచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. అదే టైంలో డబ్బు ముఖ్యమని అనుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎవరికైనా సరే దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడు అనే విషయాల్ని కూడా ఈ సిరీస్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కేపీ వినోద్ పాత్రలో నివిన్ పౌలీ సెటిల్డ్‌గా చేశాడు. మలయాళంలో ప్రముఖ హీరో అయినప్పటికీ.. ఈ సిరీస్‌లో చాలా సాధారణంగా కనిపిస్తాడు. కథకి తగ్గట్లే ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఈ పాత్రకు ఉండవు. లేడీ డాక్టర్ శైలజగా చేసిన శ్రుతి రామచంద్రన్, సీనియర్ డాక్టర్ రాజీవ్ రావు పాత్రలో రజత్ కపూర్ కూడా అదరగొట్టేశారు. మిగిలిన పాత్రధారులు కూడా స్టోరీకి తగ్గట్లు జీవించేశారు. సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా కథతో పాటే వెళ్తాం. అలా చూపించారు. టెక్నికల్ అంశాలు కూడా అన్ని సెట్ అయ్యాయి. దర్శకుడు పీఆర్ అరుణ్.. ఈ సిరీస్ కోసం చాలానే రీసెర్చ్ చేశాడని అనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్ డ్రామాని చూపించినప్పుడు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఒకటిరెండు సీన్స్ తప్పితే ఓవరాల్‌గా సిరీస్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 8 ఎపిసోడ్లుగా దీన్ని తీశారు. కానీ మొత్తం రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలే.!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kajal Aggarwal: స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది
భారీగా ఆశ చూపినా… బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్
