Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

Updated on: Mar 18, 2026 | 7:43 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం గురించి ఆసక్తికర వార్త. దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ కథను మొదట ఎన్టీఆర్, అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ హీరోలకు వినిపించారు. అయితే డేట్స్, ఇతర కారణాలతో వారంతా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. చివరికి సుకుమార్ సహాయంతో కథ రామ్ చరణ్ వద్దకు చేరి, చిరంజీవి కూడా నచ్చడంతో ఆయన వెంటనే సినిమాకు ఓకే చెప్పారని నెట్టింట వైరల్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘పెద్ది’. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వివిధ కారణాలతో వాళ్లు రిజెక్ట్ చేశారట. మొదట పెద్ది సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పారట బుచ్చిబాబు. అయితే తారక్ అప్పటికే చాలా సినిమాలకు కమిటై ఉండడంతో ఈ మూవీని చేయలేపోయాడట. ఎన్టీఆర్ డేట్స్ దొరక్కపోవడంతో బుచ్చిబాబు ఈ కథని అల్లు అర్జున్ కి కూడా వినిపించారట. కానీ బన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడట. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను కూడా పెద్ది కోసం సంప్రదించారట బుచ్చి బాబు. అయితే సూర్య కూడా కొన్ని కారణాలతో ఈమూవీని చేయలేకపోయారట. దీంతో తన గురువు సుకుమార్ సహాయంతో పెద్ది కథను రామ్ చరణ్ దగ్గరకు తీసుకెళ్లాడట బుచ్చిబాబు. చరణ్ తో పాటు చిరంజీవి కూడా ఈ కథను విని బాగా ఇంప్రెస్ అయ్యారట. వెంటనే మూవీకి ఒకే చెప్పారట. అలా పెద్ది సినిమా పట్టాలెక్కిందట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడీ వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

Follow Us