రికార్డ్ స్థాయిలో OG రిలీజ్.. వేచి చూస్తున్న కొత్త రికార్డులు

Updated on: Sep 25, 2025 | 9:01 PM

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఓజి సినిమా రికార్డు స్థాయిలో విడుదలైపోయింది. ప్రీమియర్స్ నుంచే పవర్ స్టార్ మేనియా థియేటర్లను ఊపేసింది.. పైగా పుష్కరం సెంటిమెంట్ కూడా అభిమానులకు కావాల్సినంత బూస్టప్ ఇస్తుంది. మరింతకీ ఏంటా సెంటిమెంట్.. ఓజి ఎలా ఉండబోతుంది..? ఓ దర్శకుడి ఆరేళ్ళ కష్టం.. అభిమానుల మూడేళ్ళ ఎదురు చూపులకి తెరపడింది..

ఓజి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా పూర్తిగా ఓజస్ గంభీర కంట్రోల్‌లోనే ఉంది. రికార్డ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్‌లో ఓజి వచ్చేసాడు. తొలిరోజు నుంచే రికార్డుల వేట మొదలు పెట్టాడు గంభీర. పవన్ కళ్యాణ్ అభిమానులను ఈసారి పుష్కరం సెంటిమెంట్ కూడా బాగా ఊరిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా..? 12 ఏళ్ళకు ఓసారి పవన్‌కు బాక్సాఫీస్ దగ్గర పూనకాలు వస్తుంటాయన్నమాట. 2001లో ఖుషీతో ఇండస్ట్రీని షేక్ చేసారు పవర్ స్టార్. లవ్ స్టోరీతో రికార్డులు కొల్లగొట్టారు.. అప్పట్లో నయా రికార్డులు క్రియేట్ చేసారు పవన్ కళ్యాణ్. ఖుషీ వచ్చిన 12 ఏళ్ళకి అత్తారింటికి దారేదితో మరోసారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసారు పవన్. సగం సినిమా విడుదలకు ముందే లీక్ అయినా.. ఫ్యామిలీ స్టోరీతో 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి స్టామినా చూపించారు PK. మళ్లీ 12 ఏళ్ళకు ఓజితో వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈసారి ఓజితో పుష్కరం సెంటిమెంట్ రిపీట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీరుకొండపై 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం

ఫస్ట్ టైమ్ రైలు పై నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

షారూఖ్ ఫ్యామిలీపై మాజీ NCB అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా

OG టికెట్‌ ధరల పెంపుపై స్టే శుక్రవారం వరకు తొలగింపు

దక్షిణ కొరియా లో విశాఖ LG పాలిమర్స్ బాధితుల ఆందోళన