నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్..
అడిగిన వారికి సాయం చేయడంలో..! అడగని వారి అవసరాలను కూడా తెలుసుకుని వారికి కావాల్సింది చేయడంలో పవన్ ముందుంటారనే నేమ్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటి ఈ స్టార్ హీరో తనకు సాయం కావాలని ఓ నటుడిని అడిగారు. ఇక ఈ విషయాన్ని పవనే స్వయంగా చెప్పి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు.
ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రారంభించగా, ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తూనే.. హరి హర సినిమాపై ఎక్కడ లేని అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఇవ్వాలని… అర్జున్ దాస్ను స్వయంగా కళ్యాణే సాయం కోరాడట. దీంతో అర్జున్ దాస్ ఏమాత్రం ఆలోచించకుండా తన వాయిస్‌ను ఇచ్చేశారట. ఇక అర్జున్ దాస్ సాయానికి ఫిదా అయిన పవన్ కల్యాణ్ ఈ హీరోకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. ‘నేను అరుదుగా సాయం అడుగుతుంటా. నేను అడిగింది నువ్వు చేశావ్. డియర్ బ్రదర్.. నీకు నేను కృతజ్ఞుడిని. నీ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంది’ అని ట్వీట్ చేశారు పవన్. ఇక అంతకు ముందు అర్జున్ దాస్ కూడా ఓ ట్వీట్ చేశాడు.’పవన్ కళ్యాణ్ అడిగితే కాదంటామా.. ఎలాంటి ఎదురు ప్రశ్నలు లేకుండా హ్యాపీగా ట్రైలర్‌కు వాయిస్ ఇచ్చాను’ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. దీనికి రిప్లై గానే పవన్ అర్జున్ దాస్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలెర్ట్.. అలెర్ట్..! వారందరికీ దిల్ రాజు హెచ్చరిక
అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ వాళ్లకు దిమ్మతిరిగేలా చేశాడు