కలెక్టర్‌ కొలువు వదిలిపెట్టి.. సినిమాల్లోకి వచ్చి.. శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ

Updated on: May 31, 2025 | 10:11 AM

మన దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఉద్యోగానికి ఎంత గౌరవం ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ జాబ్ ను సాధించాలని ఎంతో మంది కలలు కంటారు. లక్షలాది మంది యువత UPSC పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనుకుంటారు. కానీ మీకు తెలుసా.. ఇప్పడు ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు ఒకప్పుడు IAS ఆఫీసర్.

తన ఉద్యోగాన్ని వదిలి పెట్టి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సినిమాలు అంటే ఇష్టం.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. తరువాత ఈ ఫీల్డ్ లోనూ సక్సెస్ అయ్యారు. తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు. అతడు మరెవరో కాదు.. బీవీపీ రావు అలియాస్ పాపారావు బియ్యాల. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన మునిగలవేడు గ్రామానికి చెందిన బియ్యాల వెంకట పాపారావు 1954 జూన్ 14న జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, తల్లి గృహిణి. ఇక ఆయన ఎడ్యుకేషన్‌ మునిగలవేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ప్రాథమిక, మాధ్యమిక తరగతులను తెలుగు మీడియంలో చదివారు. ఆ తరువాత హయ్యర్ ఎడ్యుకేషన్‌ కోసం.. వరంగల్‌లోని ఎ.వి.వి హైస్కూల్‌కి వెళ్లారు. అక్కడే వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో కూడా పట్టభద్రుడయ్యారు పాపారావు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన పాపారావు.. అక్కడ ఎల్‌ఎల్‌బి పూర్తిచేశారు. ఆ తర్వాత 1979లో ఇంటర్నేషనల్ లా లో ఎంఫిల్, పిహెచ్‌డి చేయడానికి న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరారు. అయితే అది కంప్లీట్ అవకముందే.. 1982లో ఆయన IAS కు సెలక్ట్ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకిస్తాన్‌తో సన్నీ యాదవ్‌కు లింకేంటి ?? NIA అదుపులో తెలుగు యూట్యూబర్

పవన్ సైగతో తనిఖీలు.. వణికిపోతున్న థియేటర్ల ఓనర్లు

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్‌.. అన్నకు చేసినట్టే.. సేమ్‌ అదే మాదిరి!