పాన్ ఇండియా మార్కెట్‌పై అగ్ర నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ప్యాన్ ఇండియా సినిమాల మోజుతో హీరోలు, దర్శకులు సినిమాల రిలీజ్‌లను ఆలస్యం చేస్తూ బడ్జెట్లు పెంచుతున్నారా? అన్ని భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి భారీగా ఖర్చు చేయడం అవసరమా అనే చర్చ మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ప్యాన్ ఇండియా కంటే ప్యాన్ సౌత్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. మంచి కంటెంట్, నేటివిటీతో సినిమా తీస్తే డబ్బింగ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్యాన్ ఇండియా మాయలో పడి హీరోలు, డైరెక్టర్లు అనవసరంగా సినిమాల రిలీజ్ స్పీడ్‌ను తగ్గించేస్తున్నారా..? అన్ని భాషల ఆర్టిస్టులను తీసుకొచ్చి కోట్లు ఖర్చు పెడుతూ బడ్జెట్లు పెంచేయడం నిజంగా అవసరమా..? అసలు ఈ ప్యాన్ ఇండియా కన్నా మంచి కంటెంట్‌ను నమ్ముకుని ప్యాన్ సౌత్‌గా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు కదా..? ఇదే కామెంట్స్ ఓ నిర్మాత చేసాడిప్పుడు. మరి అదేంటో చూద్దామా..? ఇప్పుడు హీరో ఎవరైనా.. ప్యాన్ ఇండియా కామన్. మాట్లాడితే భారీ సెట్లు, ఎలివేషన్స్ వెనక పడుతుండటంతో రిలీజ్‌లు తగ్గిపోయాయి. టయర్ 1, 2, 3 అందరూ రెండేళ్లకో సినిమా చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మైండ్ సెట్‌తో డైరెక్టర్స్ కాంప్రమైజ్ కావట్లేదు. దీనికి తోడు ఓటీటీ టెన్షన్, పక్క భాషల ఆడియన్స్‌ను మెప్పించాలనే టెన్షన్ కూడా సినిమా ఔట్‌పుట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కేవలం ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులను తీసుకొచ్చి భారీగా రెమ్యునరేషన్లు ఇస్తూ కోట్లు కుమ్మరించడం ట్రెండ్ అయిపోయిందిప్పుడు. ఈ విషయంపైనే మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. ప్యాన్ ఇండియా మోజులో పడి హీరోలు చెడిపోతున్నారన్నారు.. మనకు ప్యాన్ సౌత్ చాలు, కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే డబ్బింగ్ అయినా సరే తెలుగు ఆడియన్స్ చూస్తారన్నారు రవి. ఒకప్పుడు నాయకుడు, బాషాతో పాటు ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో తమిళ ఆర్టిస్టులే ఉన్నా కంటెంట్ ఉండి ఆడాయని.. నేటివిటీ మిస్ కాకుండా ఒరిజినల్‌ను ఒరిజినల్‌లా ఇస్తే చాలు ప్రతీ సినిమాను చూస్తారన్నారు రవిశంకర్. సర్దార్ 2 ప్రీ రిలీజ్‌లో ఈయన చేసిన ఈ కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయిప్పుడు. ఆయన అన్నారని కాదు నిజంగా మన హీరోలు ప్యాన్ సౌత్ గురించి ఓసారి ఆలోచిస్తే బెటర్ ఏమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!