‘ప్రేమ కథల్లో ఈ ప్రేమ కథ వేరయా..’ ఆకట్టుకుంటున్న ఒక పార్వతి.. ఇద్దరు దేవదాసులు
ప్యార్.. ఇష్క్.. కాదల్.. లవ్.. పేరు ఏదైనా.. ఈ జానర్ సినిమాలిచ్చే కిక్కే వేరు. యూత్‌కు ఇవంటేనే మోర్ లైకు.! అందుకే ఈ సినిమాలను తెరకెక్కించేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ప్రేమకు తోడు.. అందలో కొత్త కాన్పెప్ట్ ఉంటే ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చూపించే వరకు వదలరు. ఇప్పుడు మాహిష్మతి బ్యానర్ ప్రొడ్యూసర్స్ కూడా ఇదే చేస్తున్నారు.
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో లవర్ స్టోరీని మనకు అందిస్తున్నారు. పార్వతి దేవదాసుల ప్రేమ కథకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు టైటిల్ తో ఓ విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అది కాస్తా ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోట రామకృష్ణ దర్శక నిర్మాత గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా రాశి సింగ్ హీరోయిన్ గా నటించారు. రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదొక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకనిర్మాత తోట రామకృష్ణ తెలియజేశారు. సంగీత దర్శకుడు మోహిత్ రహమానియాక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ తో పాటు సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల ఆకట్టుకునే సాహిత్యం అందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
84 కోట్లు పెట్టి.. లగ్జరీ విల్లాను దక్కించుకున్న హీరోయిన్
పెళ్లైన ఆరు నెలల తర్వాత.. సడెన్ షాకిచ్చిన టాలీవుడ్ హీరో…
అంతా నా కర్మ…! అందుకే నాకు ఇన్ని బాధలు.. అమర్ దీప్ ఎమోషనల్!