డ్రాగన్‌ తారక్‌.. లుక్‌ అదిరింది నీల్‌

Updated on: Nov 07, 2025 | 6:01 PM

ఇటీవల ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాపై వచ్చిన రూమర్లకు తాజాగా విడుదలైన అప్‌డేట్ చెక్ పెట్టింది. తారక్ మేకోవర్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. నీల్ స్వయంగా తారక్ లుక్‌ను పర్యవేక్షిస్తున్నారు. "దేవర" తర్వాత అంతకుమించిన మాస్ హిట్ అందించే లక్ష్యంతో, పక్కా ఇంటర్నేషనల్ మూవీని సిద్ధం చేస్తున్నట్లు నీల్ కాంపౌండ్ హింట్ ఇస్తోంది.

ఇండస్ట్రీలో రూమర్స్ రావడం, అవి హల్చల్ చేయడం సహజం. అయితే, ప్రశాంత్ నీల్ కాంపౌండ్‌లో ఇటీవల అటువంటి ఒక రూమర్‌కి చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా హోల్డ్‌లో పడిందని గతంలో కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా విడుదలైన అప్‌డేట్‌తో ఈ వార్తలకు తెరపడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత స్క్రిప్ట్‌ను రీవ్యాంప్ చేయడం నీల్‌కి అలవాటేనని, డ్రాగన్ విషయంలో కూడా అదే జరిగిందని సమాచారం. అయితే, షెడ్యూల్‌కు ఎక్కువ సమయం పట్టడంతో రూమర్స్ మొదలయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు