సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్.. కెరీర్ బ్యాలన్స్ కోసం నానా కష్టాలు
నార్త్ హీరోయిన్‌లు దక్షిణాది సినిమాల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు వారి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? దీపిక, ఆలియా లాంటి తారలు అవకాశాలను కోల్పోతుంటే, జాన్వీ కపూర్ మాత్రం రెండు చోట్లా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. రెమ్యునరేషన్, టైమింగ్స్ వంటి కారణాలతో కొందరు దూరం అవుతుంటే, మరికొందరు సరైన ప్రాజెక్టుల ఎంపికలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రయాణం వారి ఫ్యాన్ బేస్, మార్కెట్ విలువను ఎలా మారుస్తోంది అనేది ఈ కథనంలో చూడండి.
అన్నీ చోట్లా మనమే కనిపించాలనే కోరిక గ్లామర్ ఫీల్డ్ లో చాలానే ఉంటుంది. ఎలాగైనా మెప్పించాలి… అనే టార్గెట్‌తో ఉరుకులు పరుగులు తీయడం అలవాటైపోతుంది. అన్ని చేసినా, రిజల్ట్ కోరినట్టుగానే ఉంటోందా? కమాన్ లెట్స్ వాచ్.. నార్త్ లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దీపిక.. రెమ్యునరేషన్, టైమింగ్స్ అంటూ తనకు తానే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. దీంతో చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడపాల్సిన లేడీ, ఎక్కడో ఒక్కడుగు వెనక్కేసిన ఫీలింగే వస్తోంది అభిమానులకు. ఆలియా కూడా అంతే. సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్నా, ఇక్కడి ప్రాజెక్టులకు సైన్ చేయడానికి తటపటాయిస్తున్నారు. దీని రిఫ్లెక్షన్ కెరీర్ మీద కూడా పడుతోంది. అప్పుడెప్పుడో ట్రిపుల్ ఆర్ టైమ్‌లో ఆలియాను అక్కున చేర్చుకున్న సౌత్ ఆడియన్స్, ఇప్పుడు నెమ్మదిగా ఆమెను మర్చిపోయే పరిస్థితి కనిపిస్తోంది. శ్రద్ధా కపూర్, కృతి సనన్ పరిస్థితి కూడా ఇంతే. శ్రద్ధకి తెలుగులో మంచి హిట్ ఉంది. కృతికి సరైన విజయం ఇంకా దరిచేరలేదు. సో, సౌత్ ఆడియన్స్ కి బాగా తెలిసిన వారే అయినా ఎందుకో డిస్టన్స్ మెయింటెయిన్ చేస్తున్న ఫీల్ క్రియేట్ అయింది. నార్త్ హీరోయిన్ల పరిస్థితికి భిన్నంగా ఉంది జాన్వీ సిట్చువేషన్. ఇక్కడ వరుస సినిమాలతో క్లిక్ కావాలన్న ట్రయల్స్ లో, నార్త్ లో హోల్డ్ వదులుకోకూడదని వచ్చిన ప్రతి అవకాశానికీ ఓకే చెప్పేస్తున్నట్టున్నారు. ఆ ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది జాన్వీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: అత్తవారింట సమంతకు గ్రాండ్ వెల్‌కమ్
Bigg Boss Telugu: బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
Ritu Choudhary: భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
TOP 9 ET News: రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం