Micheal Jackson: మైఖేల్ జాక్సన్ జీవితంపై అత్యంత వివాదాస్పద సిరీస్

Edited By:

Updated on: May 22, 2026 | 4:25 PM

పాప్ దిగ్గజం మైఖెల్ జాక్సన్ జీవితంపై మరో డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది. ‘మైఖెల్ జాక్సన్: ది వెర్డిక్ట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో ఆయన జీవితంలోని అత్యంత వివాదాస్పద 2003 కేసును ప్రధానంగా చూపించనున్నారు. కోర్టు విచారణలో పాల్గొన్న జ్యూరీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టుల వ్యాఖ్యలతో రూపొందిన ఈ సిరీస్ జూన్ 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

బతికున్నపుడు కూడా మైఖెల్ జాక్సన్ ఇంతగా ట్రెండ్ అయ్యారో లేదో తెలియదు కానీ.. గత రెండు నెలలుగా ఈయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. మొన్నే ఈయనపై బయోపిక్ వచ్చింది.. అంతలోనే మరొకటి కూడా రెడీ అవుతుంది. అయితే ఈసారి పూర్తిగా కాంట్రవర్షియల్..! వివాదాలే కేంద్రంగా ఈసారి డాక్యుమెంటరీ రెడీ అవుతుంది. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా..? పాప్ దిగ్గజం మైకేల్ జాక్స‌న్ లైఫ్ ఎప్పుడూ ట్రెండింగే. ఈయన జీవితంలో విజయాలెన్ని ఉన్నాయో.. వివాదాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. వాటినే ఇప్పుడు క్యాష్ చేసుకోడానికి చూస్తున్నారు. ఈ మధ్యే వచ్చిన బయోపిక్ పూర్తిగా జాక్సన్‌లోని పాజిటివ్స్‌ను మాత్రమే చూపించారు.. స్లోగా ఉందనే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. మైఖెల్ బయోపిక్‌లో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించారు. తాజాగా మైఖెల్ లైఫ్ మీద మరో బయోపిక్ వస్తుంది.. ఈసారి మాత్రం పాజిటివ్ యాంగిల్ కాదు.. పూర్తిగా వివాదాస్పద కోణంలో ఇది రానుంది. మైకేల్ జాక్సన్: ది వెర్డిక్ట్ పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ తరహాలో సాగే సిరీస్‌లో ఆయన లైఫ్‌లోని అత్యంత వివాదాస్పద 2003 బాలల లైంగిక వేధింపుల విషయాన్ని టచ్ చేస్తున్నారు. కోర్టు నిర్దోషిగా తేల్చినా.. ఆ కేసు ముద్ర అలాగే ఉండిపోయింది. ట్రైలర్‌లో నాటి కోర్టు విచారణలో పాల్గొన్న జ్యూరీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల కామెంట్స్ ఇన్‌బిల్ట్ చేసారు. ఈ సిరీస్ కేవలం కేసు గురించే కాదు.. ఆ తర్వాత మైఖెల్ జీవితం ఎలా మారిందనేది కూడా చూపిస్తున్నారు. ప్రముఖ ఓటిటిలో జూన్ 3 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్‌ హీరో!

Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్

Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Follow Us