పాత స్టార్ హీరోయిన్లకు చెక్.. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ సినిమాలతో కొత్త భామల హవా!

Edited By:

Updated on: Aug 09, 2026 | 6:11 PM

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల హవా మొదలైందనే చర్చ సాగుతోంది. రష్మిక మందన్న, శ్రీలీల, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ల స్థానాన్ని రుక్మిణి వసంత్, ఇమాన్వి ఇస్మాయిల్, త్రిప్తి డిమ్రీ వంటి కొత్త భామలు భర్తీ చేసేలా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ‘డ్రాగన్’, ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాలతో వీరు తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఈ సినిమాలు హిట్ అయితే టాలీవుడ్‌లో వీరి క్రేజ్ మరింతగా పెరిగే అవకాశముంది.

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ మొదలైపోయిందా..? పాత హీరోయిన్లు తట్టాబుట్టా సర్దుకుని కొత్త వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారా? రష్మిక, శ్రీలీల లాంటి స్టార్స్ మెల్లగా సైడ్ అవుతుంటే.. ఆ ప్లేస్‌లోకి కొత్తనీరు వచ్చి చేరుతుందా..? ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటి బడా స్టార్స్‌ను కవర్ చేస్తున్న ఆ కొత్త బ్యూటీస్ ఎవరో చూద్దామా..? టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉండేదే. ఒకప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోయిన పూజా హెగ్డే, రష్మిక మందన్న, శ్రీలీల లాంటి వాళ్లంతా కొత్త హీరోయిన్లకు సైడ్ ఇచ్చారిస్తున్నారిపుడు. వాళ్ళ ప్లేస్‌ భర్తీ చేస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ క్రేజీ ఆఫర్లతో జెట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నారు. ఎన్టీఆర్‌తో డ్రాగన్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ.. సుకుమార్, రామ్ చరణ్ సినిమాలోనూ ఎంపికయ్యారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో తన క్యూట్ డాన్స్ వీడియోలతో మాయ చేసి ఫౌజీలో ఛాన్స్ కొట్టేసారు ఇమాన్వి ఇస్మాయిల్. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఏకంగా ప్రభాస్‌తో నటించే అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పండి..? ఫౌజీ రిలీజ్‌కు ముందే ఇమాన్వి పేరు మార్మోగిపోతుంది. ఈ సినిమా హిట్టైతే ఈమె ఫేట్ మొత్తం మారిపోయి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ. యానిమల్‌లో కనిపించింది కాసేపే అయినా కుర్రాళ్ళ మతులు పోగొట్టిన త్రిప్తి దిమ్రి.. స్పిరిట్‌తో తెలుగు ప్రేక్షకులపై గ్లామర్ అటాక్ చేయడానికి రెడీ అయ్యారు. సందీప్ వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ కాప్ స్టోరీపై అంచనాలు మామూలుగా లేవు. ఫౌజీ, స్పిరిట్, డ్రాగన్ గనక హిట్టైతే.. రాబోయే కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌లో ఇమాన్వి, త్రిప్తి, రుక్మిణి జెండా పాతేయడం ఖాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?

పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా!

Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్‌.. బిగ్ బాస్‌ ఆ రోజు నుంచి మొదలు..

డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!

ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు

Loading...
Unable to load recommendations.
Follow Us