అది మనసులో పెట్టుకునే.. నయన్‌పై ప్రతీకారమా ??

Updated on: Nov 29, 2024 | 1:27 PM

ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదురుతుంది. ఓ ప్రముఖ ఓటిటిలో వచ్చిన నయన్ డాక్యుమెంటరీతో మొదలైన వివాదం కాస్తా మరింత ముందుకు వెళుతోంది. ఇక తాజాగా హీరోయిన్‌ నయనతార, ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌‌పై మద్రాస్‌ హైకోర్టులో సివిల్‌ కేసు దాఖలు చేశారు ధనుష్. తన అనుమతి లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాకు సంబంధించిన విజువల్స్‌ వాడుకున్నారని పేర్కొన్నారు

. 10 కోట్లకు లీగల్ నోసులు పంపారు. ఇక కోర్టు కూడా ధనుష్‌ పిటీషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ‘వండర్‌ బార్ ఫిల్మ్స్‌’ బ్యానర్‌పై ధనుష్‌ ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాను నిర్మించారు. ఈ విషయంపైనే ధనుష్, నయనతార మధ్య వివాదం మొదలైంది. నోటీసులు పంపిన తర్వాత ధనుష్‌‌పై బహిరంగ విమర్శలు చేశారు నయన్. దాంతో వివాదం ఇంకాస్త పెద్దదైంది. ఇక ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్‌.. అసలు ధనుష్, నయనతార మధ్య ఏం జరుగుతుంది..? ఈ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..? అసలెందుకు ధనుష్‌పై నయనతార అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు..? కేవలం డాక్యుమెంటరీనే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమా..? లేదంటే ఇంకా లోలోపల గొడవలేమైనా ఉన్నాయా..? అంటూ ఆరాలు తీస్తున్నారు. అన్నింటికి మించి మొన్న ధనుష్‌పై నయనతార రిలీజ్ చేసిన లెటర్ సంచలనంగా మారింది. ఇది మనసులో పెట్టుకునే ధనుష్ ఇప్పుడు కోర్టులో నయన్ దంపతులపై పిటిషన్ దాఖలు చేశారంటున్నారు కొంత మంది సినిమా వ్యక్తులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ కథ !! ఇంటర్ నుంచి సాగుతోందట వీరి లవ్‌ ముచ్చట!

కోటీశ్వరురాలైనా .. చర్మం మెరుపుకి వంటింటి చిట్కాలే

Loading...
Unable to load recommendations.
Follow Us