నా కొడుకు కాలు విరిగింది..! అంత బాధలోనూ నా జున్ను ఆ మాట అన్నాడు..

Updated on: Sep 03, 2025 | 4:45 PM

నాచురల్ స్టార్ నానికి సినిమాలే కాదు.. తన ఫ్యామిలీ అంటే కూడా ఎంతో ఇష్టం. అందులోనూ తన కొడుకు అంటే ఈ స్టార్ హీరోకు అమితమైన ప్రేమ. వీలు దొరికినప్పుడల్లా తన కొడుకుతో టైం స్పెండ్ చేస్తుంటాడు నాని. పలు ఇంటర్వ్యూల్లో కూడా తన కొడుకు గురించి.. చెబుతుంటాడు. ఈ క్రమంలోనే తన కొడుకు ఓ సారి కాలు విరగొట్టుకున్నాడని.. చెబుతూనే ఎమోషనల్ అయ్యాడు.

ఆ టైంలో తన కొడుకు పడే బాధ తనకు కూడా విపరీతమైన బాధ కలిగించిందంటూ చెప్పాడు. రీసెంట్‌ గా జగతి టాక్ షో.. జయమ్ము నిశ్చయమ్మురా కి వెళ్లిన నాని.. తన కొడుకు జున్ను గురించి ఓ విషయం చెప్పుకొచ్చాడు. ఇటీవల జున్ను కాలికి దెబ్బ తగిలి ఫ్రాక్చర్‌ అయిందని చెప్పిన నాని.. పిల్లలకు దెబ్బ తగిలినా, ఏదైనా జబ్బు చేసినా చాలా బాధగా అనిపిస్తుందని.. తన కొడుకు విషయంలోనూ తనకు అలాంటి బాధే కలిగిందన్నాడు. ఆ సమయంలో తన కొడుకు ముఖం చూడలేకపోయానంటూ చెప్పాడు. గతేడాది జున్ను సైకిల్‌ మీద నుంచి పడటంతో కాలికి ఫ్రాక్చర్‌ అయింది. కాలు కాస్తంత పక్కకు జరిపినా సరే.. నొప్పి అని విలవిల్లాడిపోయేవాడు. వాడు కదలడానికి లేదు, లేవడానికి లేదు. బాత్రూమ్‌కు కూడా మేమే తీసుకెళ్లేవాళ్లం. ఒక్కోసారి అర్ధరాత్రిళ్లు లేచి నొప్పిగా ఉందని ఏడ్చేవాడు. వాడిని చూసుకునే క్రమంలో అంజుకు, నాకు సరిగా నిద్రుండేది కాదు. ఒకరోజు రాత్రి జున్ను సడన్‌గా లేచి నా చేయి పట్టుకుని సారీ నాన్న అన్నాడు. నాకెందుకు సారీ చెప్తున్నావురా? అంటే నా వల్ల మీ అందరికీ నిద్ర ఉండట్లేదు కదా అన్నాడు. అంత చిన్న పిల్లాడికి అంత పెద్ద మాట ఎలా వచ్చిందో అంటూ తాను భావోద్వేగానికి లోనయ్యానంటూ చెప్పాడు నాని. ఇప్పుడు తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు కూడా.. !

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..

Kannappa: ఎట్టకేలకు OTTలోకి కన్నప్ప మూవీ..! విష్ణు తెలివే వేరబ్బా..!

సినిమా చేస్తే సరిపోతుందా? ప్రమోషన్స్‌కి డుమ్మా కొడితే ఎలా? అనుష్క తీరుపై విమర్శలు

రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో లేడీ ప్రొఫెసర్‌కు వేధింపులు

100కోట్ల రేంజ్‌ అవుట్ పుట్ దిమ్మతిరిగే కాన్పెప్ట్.. హిట్టా..? ఫట్టా..?