kalyan Ram: తమ్ముడు బక్కచిక్కిపోతే.. అన్నకు ప్రశ్నేంటి?

Updated on: Apr 16, 2025 | 6:42 PM

తాత ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న వారిలో.. కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఈయన సినిమాల్లో హీరోగానే కాదు.. తన పేరు మీద సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేస్తూ.. నందమూరి పేరును తెలుగు టూ స్టేట్స్‌లో మార్మోగిపోయేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ హీరోను.. ఓ రిపోర్టర్ అడిగిన ఒక్క ప్రశ్న మాత్రం షాకయ్యేలా చేసింది. అదే ఎన్టీఆర్ ఎందుకు సన్న బడ్డాడనే కొశ్చన్. ఇక దేవర సినిమా తర్వాత వార్‌ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగెడుతున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్ తో చేసే పాన్ ఇండియా మూవీ డ్రాగన్‌ కోసం స్లిప్‌ అవతార్‌లోకి మారాడు. తను ఆ సినిమాలో చేసే క్యారెక్టర్‌ డిమాండ్ చేయడంతో.. జీరో సైజ్‌లోకి వచ్చాడు. తన అన్న కళ్యాణ్ రామ్ ఈవెంట్లోనూ ఇదే లుక్‌తో కనిపించాడు. ఆ ఫోటోలతో.. వీడియోలతో తెగ వైరల్ అయ్యాడు. అయితే ఈ ఫోటోలను, వీడియోలను పట్టుకున్న ఓ ఫిల్మ్ రిపోర్టర్‌.. తన సినిమా ప్రమోషన్ కోసి ఆ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓప్రశ్న అడిగాడు. ఎన్టీఆర్ ఎందుకు బక్కచిక్కాడు .. మీరే ట్రైనింగ్ ఇచ్చారా అంటూ.. అన్న కళ్యాణ్ రామ్‌ను ప్రశ్నించాడు. దీంతో కాస్త అసహనం వ్యక్తి చేసినట్టు మొఖం పెట్టిన అన్న.. ఎన్టీఆర్ ఓ సూపర్ స్టార్. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్. నేషనల్ లెవల్ కు ఆయన స్థాయి చేరింది. దేశంలోనే టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. వాళ్లిద్దరికీ నేను సలహాలు ఇస్తానా..? నేను, తారక్ ఏం చేసినా సినిమా కోసమే.. ఇన్‌డైరెక్ట్‌గా.. షార్ట్‌ కట్‌లో జవాబిచ్చాడు. అయితే ఆ రిపోర్టర్ అడిని ఈ ప్రశ్న.. కళ్యాణ్ ఎక్స్‌ప్రెషన్ .. ఇచ్చిన సమాధానం ఈ మూడు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో పాటే.. తమ్ముడు బక్కచిక్కిపోతే.. అన్నకు ప్రశ్నేంటి? అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమానవీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి క్లాస్‌ రూమ్‌ బయట పరీక్ష!

Samantha: ఫ్యాన్స్‌ ఎఫెక్ట్‌ సమంతకు కోట్లలో నష్టం

ఇదేంది మావా.. ఈ రీజన్ తో కూడా భర్తను వదిలేస్తారా ??

ఇది సినిమాలా లేదు.. చిన్న పాటి బ్లూ ఫిల్మ్‌లా ఉంది..!

పవన్‌ ఇంటికి వెళ్లి.. చిన్ని మార్క్‌కు ధైర్యం చెప్పిన ఐకాన్ స్టార్