Custody: నాగ చైతన్య కస్టడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రెస్పాన్స్ అదుర్స్

|

Apr 12, 2023 | 9:43 AM

థాంక్యూ మూవీ తర్వాత అక్కినేని వారసుడు నాగ చైతన్య చేస్తున్న కొత్త సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

థాంక్యూ మూవీ తర్వాత అక్కినేని వారసుడు నాగ చైతన్య చేస్తున్న కొత్త సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నాగచైతన్య కెరీర్ లో 22వ మూవీగా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ సాంగ్ లాంచ్ చేశారు. కొన్నాళ్లుగా పరాజయాల్లో ఉన్న చైతన్య ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని చూస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగ చైతన్య పవర్‌‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌గా నటిస్తున్నాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘హెడ్ అప్‌ హై’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదలైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్

ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు

పిట్ట చిన్నదే కానీ.. మహా ముదురు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

అడవిదున్నపై పులి ఎటాక్‌.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

ఏం ఐడియా బాస్‌.. ఇది ఇండియా దాటకూడదంతే..

 

Follow us on