Naa Anveshana: సిరి హన్మంతు గుట్టు రట్టు చేసిన అన్వేష్‌

Updated on: Apr 07, 2025 | 5:26 PM

విదేశాల్లో ట్రావెల్ వ్లాగ్స్‌ చేస్తూ.. పాపులర్ అయిన అన్వేష్.. ఇప్పుడు ట్రావెలింగ్ మీది నుంచి తన టార్గెట్‌ సెలబ్రిటీల వైపు మళ్లించాడు. వారిలో ఎవరెవరు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారన్న దానిపై ఓ లిస్టు రెడీ చేసుకుని వారిపై వరుసగా వీడియోలు చేస్తున్నాడు. తన స్టైల్లో వారిని విమర్శిస్తూ.. వారిపై సెటైర్లు వేస్తూ.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వారు ఎంత సంపాదించారన్న వివరాలను బయటపెడుతూ.. వారి గుట్టును రట్టు చేస్తున్నాడు.

ఆ వీడియోలను తన యూట్యూబ్‌ చానెల్స్‌లో అప్లోడ్‌ చేస్తూ .. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంటున్నాడు. తాను కూడా గట్టిగానే సంపాదించేస్తున్నాడు. ఇక ఈక్రమంలోనే తాజాగా సిరి హన్ముంతు పై ఓ వీడియో చేసి వదిలాడు ఈయన. షార్ట్‌ ఫిల్మ్స్‌ త్రూ.. ఓ న్యూస్‌ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్‌ షార్ట్ ఫిల్మ్స్ కారణంగా.. యూట్యూబ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్ బాస్ వరకు వెళ్లింది. ఇక బిగ్ బాస్‌లో.. షణ్ముక్‌ తో కలిసి లోపలికి వెళ్లిన ఈమె… మనోడికి కాస్త సన్నిహితంగా.. ఉండడంతో అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఓ దశలో బిగ్ బాస్‌లో షణ్ముక్‌, సిరిల రొమాన్స్‌ శృతి మించుతోందనే కామెంట్ ఉంది. పైగా షణ్నుక్‌కు దీప్తి సునయనతో.. సిరికి శ్రీహాన్‌తో అప్పటికే పర్సనల్ లైఫ్‌లో రిలేషన్‌ ఉండడంతో.. వీరిద్దరూ రిలేషన్‌ బార్డర్స్ క్రాస్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరిగింది. అలా బిగ్ బాస్‌ సీజన్‌ కారణంగా.. వీరి రిలేషన్‌ షిప్‌ ఇష్యూ కారణంగా.. ఈమెకు సోషల్ మీడియా మార్కెట్లో సెలబ్రిటీ స్టేటస్‌తో పాటు.. క్రేజ్ పెరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వీట్ వాయిస్ కోసం పాము వీర్యం తాగుతున్న సింగర్‌…