AR Rahman: బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్

Updated on: Apr 24, 2025 | 2:52 PM

స్టార్ హీరోలు.. సెలబ్రెటీలందరూ ఇప్పుడు పెట్రోలు, డీజిల్ కార్లను వదిలి పెట్టి.. ఎలక్ట్రిక్‌ కార్ల వెంట పడుతున్నారు. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను భారీ రేట్‌ను కొనేస్తూ.. ఆ పిక్స్‌తో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌ కూడా ఎలక్ట్రిక్ కార్‌ను ఓన్ చేసుకున్న వాళ్ల లిస్టులో చేరిపోయాడు. మహింద్రా బ్యాండ్ న్యూ బీఏ6 ఎలక్ట్రిక్ కార్‌ను సొంతం చేసుకున్నాడు.

తన మ్యూజిక్‌తో.. ఆస్కార్ రేంజ్‌ వరకు వెళ్లిన రెహ్మాన్ ఇప్పుడు సినిమాలు తగ్గించేశాడు. సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ తనదైన మ్యూజిక్ ఇస్తున్నాడు. దాంతో పాటే మీడియాకు కూడా దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటి ఈయన ఇటీవల తన భార్యతో విడిపోయి నెట్టింట వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ న్యూ కార్ కొని ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. తాజాగా ఈయన మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. మహీంద్ర సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఇది. ధర రూ.25-35 లక్షల మధ్య ఉండొచ్చు. రెహమాన్ ఈ కారు కొనడం వెనక మార్కెటింగ్ కూడా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపం! ఎలాంటి డైరెక్టర్‌.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..

Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..