Murali Mohan: ఇక.. పద్మశ్రీ మురళీ మోహన్.. అరుదైన గౌరవంపై ఆనంద భాష్పాలు

Updated on: Jan 26, 2026 | 12:44 PM

నటుడు మురళీ మోహన్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. తన జీవితంలో మొదటిసారి ఇలాంటి అరుదైన గౌరవం రావడం పట్ల ఆయన అనంతమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు కుటుంబానికి కూడా గర్వకారణం అన్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరున్న నటుడు మాగంటి మురళీ మోహన్‌. ‘జగమేమాయ’ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు మురళీ మోహన్‌. అప్పటి నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ‘అతడు’ లాంటి మంచి సినిమాలు నిర్మించారు. త్వరలోనే తమ జయభేరి ఆర్ట్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించారు. జగమే మాయ, నేరము శిక్ష, తిరుపతి, రాధమ్మ పెళ్లి, భారతంలో ఒక అమ్మాయి, జ్యోతి లాంటి పలు సినిమాలు చేసిన ఆయనకు ‘వారాలబ్బాయి’ మంచి పేరు తెచ్చి పెట్టింది. శోభన్‌బాబు, గిరిబాబుతో పాటు అప్పట్లో పలువురు స్టార్‌ హీరోలతో కలిసి మల్టీస్టారర్‌ సినిమాలు చేశారు మురళీమోహన్‌. కథానాయకుడిగా ఎన్నో సక్సెస్‌లు చూసిన ఆయన కాలాగుణంగా కేరక్టర్‌ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. తండ్రిగా, బాబాయ్‌గా, మామగా, కుటుంబ పెద్దగా.. పలు రకాల పాత్రలతో మెప్పించారు. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన అఖండ2లోనూ కీలక పాత్రలో కనిపించారు మురళీ మోహన్‌. తన తుది శ్వాస ఉన్నంత వరకూ మేకప్‌ వేసుకుంటూనే ఉంటానని ఆ మధ్య ప్రకటించారు మురళీ మోహన్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Mega158: ‘జన నాయగన్‌’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ??

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి

‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం