Christina ashten: ప్రాణం తీసిన ప్లాస్టిక్‌ సర్జరీ.. కాసేపటికే వైద్య వికటించి ప్రాణాలు పోగొట్టుకుంది.

|

May 04, 2023 | 7:13 PM

చాలామంది సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్‌ సింగర్‌ జిమిన్‌లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్‌ వాన్‌ మృత్యువాత పడ్డారు.

చాలామంది సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్‌ సింగర్‌ జిమిన్‌లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్‌ వాన్‌ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. అమెరికన్‌ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న ఓ మోడల్‌ గుండెపోటుతో కన్నుమూసింది. 34 ఏళ్ల మోడల్‌ క్రిస్టినా అస్తెన్‌ గౌర్కానీ అచ్చం కిమ్‌ కర్దాషియన్‌లా మారిపోవాలనుకుంది. ఇందుకోసం ఆమె పలు సర్జరీలు చేసుకోగా అందరూ తనను కర్దాషియన్‌కు జిరాక్స్‌ కాపీలా ఉన్నావని పొగిడేవారు. తాజాగా ఆమె మరో సర్జరీ చేయించుకోగా అది వికటించడంతో ప్రాణాలు విడిచింది. ఆమెకు ఏప్రిల్‌ 20న గుండెపోటు రావడంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని క్రిస్టినా కుటుంబం ఆలస్యంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 04, 2023 07:13 PM