మేనేజర్ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తన వెన్నంటి ఉన్న వాళ్ల కోసం.. తనను నమ్ముకున్న వాళ్ల కోసం... ఎంత బిజీగా ఉన్న కదిలి వచ్చే మెగాస్టార్... మరోసారి అదే పని చేసి తానేంటో మరోసారి ప్రూవ్ చేశాడు. తన మేనేజర్ బిడ్డ బారసాల కార్యక్రమానికి భార్య సురేఖను తీసుకుని మరీ వెళ్లి .. ఆ చిన్నారిని ఆశీర్వదించి వచ్చాడు. ఎస్ ! మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన మేనేజర్ కుమార్తె బారసాల వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి ఈ వేడుకకు హాజరైన చిరంజీవి మేనేజర్ కుమార్తెకు కానుకలు అందించారు.
బిడ్డ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి చిన్నారి ఓ అపూర్వ కానుక కూడా అందించారట చిరు. ఆ తరువాత ఆ చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అందులో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మనశంకర వరప్రసాద్ గారు ముందుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు విశ్వంభర సినిమాను కూడా చిరంజీవి పూర్తి చేయాల్సి ఉంది. అలాగే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కే.ఎస్. రవీంద్ర తో మరో సినిమాకు రెడీ అయ్యారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు చిరంజీవి.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
