Mega158: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ??
జననాయగన్ రిలీజ్ ఎఫెక్ట్ ఇప్పుడు చిరు నెక్స్ట్ సినిమా మీద పడుతోందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చిరు- బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న Mega158 సినిమా కేవీఎన్ ప్రొడక్షన్లో తెరకెక్కనుంది. జన నాయగన్ సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది.
జననాయగన్ రిలీజ్ ఎఫెక్ట్ ఇప్పుడు చిరు నెక్స్ట్ సినిమా మీద పడుతోందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చిరు- బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న Mega158 సినిమా కేవీఎన్ ప్రొడక్షన్లో తెరకెక్కనుంది. జన నాయగన్ సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే మెగా 158 ప్రాజెక్ట్‌తో నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకి డీల్ కుదుర్చుకున్నారు. అయితే జన నాయగన్ సెన్సార్ గొడవ కారణంగా ఆ సంస్థ కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో చిరు- బాబీ సినిమా మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి మూవీ.. జన నాయగన్ ఎఫెక్ట్ వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అయితే, అంత వరకు చిరు, బాబీ వేచి చూస్తారా..? అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. రీజినల్ సినిమాల్లో ఆన్‌లైన్ టికెటింగ్ యాప్స్‌లో సరికొత్త రికార్డులకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ కేరాఫ్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 5.2 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి. ఏ రీజనల్ సినిమాకు అయినా ఇదే హయ్యస్ట్ టికెట్స్ బుక్ అవ్వడం అని మేకర్స్ ప్రకటించారు. రెండో వారంలోనూ ఈ సినిమా దూకుడు చూపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్ పోలీసులకు SKN ఫిర్యాదు
Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్ మరి
‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం
TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!
Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీకి.. రిబ్బన్ కట్ చేసిన శర్వా..
