సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్

Edited By:

Updated on: Nov 24, 2025 | 8:16 PM

2026 సమ్మర్‌ను మెగాభిమానులు తమదే అంటున్నారు. రామ్ చరణ్ 'పెద్ది'తో మార్చి 27న వేసవి సందడి ప్రారంభం కానుంది. ఏప్రిల్‌లో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్‌సింగ్', చిరంజీవి 'విశ్వంభర', సాయి తేజ్ 'సంబరాల ఏటి గట్టు' చిత్రాలు వరుసగా రాబోతున్నాయి. మెగా హీరోల ఈ భారీ విడుదలలతో టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం నిండేందుకు సిద్ధంగా ఉంది, అభిమానులు 'పూనకాలు లోడింగ్' అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2026 సమ్మర్‌ మాదే అంటున్నారు మెగాభిమానులు. పూనకాలు లోడింగ్‌ అంటూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఎదురుచూస్తున్నారు. మార్చి నుంచి వేసవి మొత్తం మాదే అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వారి దగ్గర. ఇంతకీ ఏయే సినిమాలు వేసవికి రానున్నాయో ఓ సారి చూసేద్దాం వచ్చేయండి. చికిరి చికిరి సాంగ్‌కి, అందులో చరణ్‌ వేసిన స్టెప్పులకీ ఫిదా అవుతున్నారు మెగాభిమానులు. ఇది కదా మేం కోరుకున్నది అని హ్యాపీగా కనిపిస్తున్నారు. పెద్ది సినిమాను గ్లోబల్‌ రేంజ్‌ సక్సెస్‌ చేసి చూపించమని అడుగుతున్నారు బుచ్చిబాబు సానాని. మార్చి 27న మెగా పండగను షురూ చేయడానికి రెడీ అవుతున్నారు మెగాపవర్‌స్టార్‌. మెగా పవర్‌స్టార్‌ సినీ రిలే స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయడానికి ఏప్రిల్‌ సెకండ్‌ వీక్‌లో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ వచ్చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ గ్యారంటీ అంటూ ప్రొడ్యూసర్‌ మైత్రి రవి చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపేస్తున్నాయి. తమ్ముడు సక్సెస్‌ రూట్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రెడీ అవుతున్నారు విశ్వంభర. సమ్మర్‌లో సినిమా తప్పక వస్తుంది.. ఇప్పటిదాకా ఎవరూ చూడని ప్రపంచాన్ని విశ్వంభరలో చూడబోతున్నారు. అత్యంత అద్భుతంగా ఉంటుందని భరోసా ఇచ్చేస్తున్నారు మెగా స్టార్‌ చిరు. ఆల్రెడీ సంక్రాంతికి మనశంకరవరప్రసాద్‌గారుతో కనిపించే ఆయన, సమ్మర్‌లో సెకండ్‌ టైమ్‌ షేక్‌ హ్యాండ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. పెద్ద మావయ్య సినిమా వచ్చి వెళ్లిన గ్యాప్‌లో రంగంలోకి దూకేయడానికి రెడీ అవుతున్నారు సంబరాల ఏటి గట్టు హీరో సాయితేజ్‌. తుక్కుగూడలోని సెట్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది సంబరాల ఏటిగట్టు. ఎవరూ ఊహించని కథతో సమ్మర్‌ రేసులో జాయిన్‌ అవుతున్నారు హీరో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??

నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి

స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్

రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు

క్రెడిట్‌ కార్డులున్నాయా ?? జాగ్రత్త పడకపోతే అప్పుల్లోకే