Meena: అది నా డ్రీమ్ క్యారెక్టర్‌..ఆమె కొట్టేసింది.. అందుకే ఆమె అంటే..

|

Oct 03, 2022 | 9:36 AM

పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాతో నాలుగేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై దర్శనమిచ్చారు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌. రెండు పవర్‌ ఫుల్‌ పాత్రలతో ఫ్యాన్స్‌కు డబుల్ కిక్‌ ఇచ్చారు.

పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాతో నాలుగేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై దర్శనమిచ్చారు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌. రెండు పవర్‌ ఫుల్‌ పాత్రలతో ఫ్యాన్స్‌కు డబుల్ కిక్‌ ఇచ్చారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కెంచిన ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్‌, జయం రవి, కార్తీ, త్రిష, ప్రకాశ్‌రాజ్‌, ఇలా ఎంతోమంది తారలు నటించారు. అయినా ఐశ్వర్యనే సినిమాకు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ అయ్యింది. అందుకు తగ్గట్లే సినిమా విడుదలయ్యాక నాలుగు పదుల ఐశ్వర్య అందం, అంతకుమించిన అభినయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ నటీమణి మీనా, ఐశ్వర్యరాయ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సోషల్‌ మీడియా వేదికగా పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాపై స్పందించిన ఆమె ఐశ్వర్యను చూస్తుంటే జీవితంలో మొదటిసారి అసూయ కలుగుతోందన్నారు. పొన్నియన్‌ సెల్వన్ మూవీలో ఐశ్వర్య చేసిన నందిని పాత్ర ‘తన డ్రీమ్‌ క్యారెక్టర్‌ అని, ఆ క్యారెక్టర్‌ కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూస్తుంటే జీవితంలో తొలిసారి సాటి నటిపై అసూయ కలుగుతుందన్నారు. తన జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారన్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించిన నటీనటులందరికీ తన అభినందనలు అని’ పీఎస్‌-1లో ఐశ్వర్య స్టిల్స్‌ను షేర్‌ చేసారు మీనా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీనా చెప్పింది నిజమేనంటూ ఐష్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. కాగా సెప్టెంబర్‌ 30 న విడుదలైన పొన్నియన్‌ సెల్వన్‌ మొదటి రోజే దాదాపు 39 కోట్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా 23.50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 39 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌నిపుణులు తెలిపారు. ఇక మీనా విషయానికొస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రామంలో వింత రూల్.. సైరన్ మోగిందంటే వాటిని పక్కన పడేయాల్సిందే !!

ష్.. నేనూ ఇక్కడే పడుకుంటా.. డిస్టర్బ్ చెయ్యొద్దు..

ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??

ఇకపై వాట్సాప్‌ మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??

ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్‌ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..

 

Published on: Oct 03, 2022 09:36 AM