పెళ్లి తర్వాతే అసలైన జోరు… మ్యారీడ్ హీరోయిన్లదే ఇప్పుడు ఇండస్ట్రీలో హవా..!

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:33 AM

పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ నెమ్మదిస్తుందనే అభిప్రాయాన్ని స్టార్ భామలు పూర్తిగా మార్చేస్తున్నారు. కీర్తి సురేష్, రష్మిక మందన్న, అలియా భట్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. భారీ రెమ్యునరేషన్లు అందుకుంటూ, గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెరిసి ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగిస్తున్నారు.

పెళ్లి అనేది ఒకప్పుడు కెరీర్‌కు అడ్డంకి కానీ ఇప్పుడస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే పెళ్లైన హీరోయిన్లకే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.. రెమ్యునరేషన్ విషయంలోనూ వాళ్లు టాప్ లేపేస్తున్నారు. కావాలంటే తెలుగు ఇండస్ట్రీనే తీసుకోండి.. ఇక్కడ మ్యారీడ్ బ్యూటీస్ హవా మామూలుగా లేదు. ఒక్కొక్కరు చేతిలో రెండు మూడు సినిమాలతో రప్ఫాడిస్తున్నారు. మరి వాళ్లెవరో చూద్దామా..? పెళ్లి అనేది కెరీర్‌కు జస్ట్ కామా మాత్రమే కానీ ఫుల్ స్టాప్ కాదని చాలా మంది హీరోయిన్లు నిరూపిస్తున్నారు. కీర్తి సురేష్‌నే తీసుకోండి.. పెళ్లి తర్వాత కెరీర్‌కు దాదాపు ఏడాదిన్నర బ్రేక్ ఇచ్చారు. మధ్యలో మరే సినిమా చేయలేదు. కానీ గత ఆర్నెళ్ల నుంచి వరస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ఆల్రెడీ రౌడీ జనార్ధనలో విజయ్‌తో జోడీ కట్టిన ఈ బ్యూటీ.. అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ జోడీగా కన్ఫర్మ్ అయ్యారు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్‌తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తుంటే.. వెంకీతో కీర్తి సెట్ అయ్యారు. హిందీ, తమిళంలో కూడా కీర్తి బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత జోరు బాగా పెంచేసిన మరో బ్యూటీ రష్మిక మందన్న. తెలుగులో మైసాతో పాటు భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలిలో నటిస్తున్నారు రష్మిక. రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది.. మైసా కూడా ఇదే ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అలాగే హిందీలో ఓ బడా ప్రాజెక్ట్ రష్మిక చేతుల్లోకి వచ్చిందని.. ఆ సినిమా కోసం 15 కోట్ల రెమ్యునరేషన్ ఓకే అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అలియా భట్ సైతం తెలుగులో బిజీ అవుతున్నారు. కల్కి 2 కోసం ఈమె పేరు బలంగా వినిపిస్తుంది. పెళ్ళి తర్వాత గ్లామర్ కాకుండా పర్ఫార్మెన్స్‌కు పదును పెడుతున్నారు అలియా భట్. ఆల్రెడీ హిందీలో భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్‌లో నటిస్తున్నారు. విక్కీ కౌశల్ ఇందులో మరో హీరో. అలాగే దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి మ్యారీడ్ హీరోయిన్స్ సైతం వరస ఆఫర్స్‌తో రప్ఫాడిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varun Tej: హిట్ సెంటిమెంట్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’పై భారీ ఆశలు

Varanasi: వారణాసికి అనుకోని సమస్య.. జక్కన్న ప్లాన్ ఏంటో..?

Suriya : ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ఫుల్ స్పీడ్

పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!

ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్

Published on: Jul 19, 2026 11:03 AM
Follow Us