అవతార్ 3 థియేటర్లలో మహేష్ !! హాలీవుడ్‌లో మార్కెట్ పై జక్కన్న మాస్టర్ ప్లాన్
మహేష్ బాబు 'వారణాసి' సినిమా ప్రపంచవ్యాప్త ప్రచారానికి రాజమౌళి ప్రత్యేక వ్యూహం రచించారు. జేమ్స్ కామెరూన్ 'అవతార్ 3' చిత్రంతో పాటు 'వారణాసి' టీజర్‌ను ప్రదర్శించనున్నారు. దీని ద్వారా మహేష్ బాబును పాన్ వరల్డ్ హీరోగా పరిచయం చేయాలనేది రాజమౌళి ఆలోచన. 'అవతార్ 3' విరామ సమయంలో కొన్ని దేశాల్లో 'వారణాసి' టీజర్ ప్లే అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసమే ఈ నిర్ణయం.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ చేయడానికి గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఓ బిగ్ ఈవెంట్ నిర్వహించాడు. వారణాసి సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఓ సూపర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్‌లో మూడవ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ 19న ఇండియాతో పాటు వివిధ దేశాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్స్ పడుతున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాకు వారణాసి టీజర్‌ను జత చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘వారణాసి’ని ప్రమోట్ చేయడానికి రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాతో పాటు చాలా దేశాల్లో ‘అవతార్ 3’ థియేటర్లలో వారణాసి సినిమా టీజర్ ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. ‘అవతార్’ సినిమా సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కారణంగా, రాజమౌళి ‘వారణాసి’ సినిమాను ప్రమోట్ చేయడానికి ఈ సూపర్ హిట్ మూవీని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో ‘అవతార్ 3’ సినిమా ఇంటర్వెల్ సమయంలో మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా టీజర్ ను ప్రదర్శించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే
TOP 9 ET News: అఖండ రిలీజ్ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
