పెళ్లి కార్డుపై మహేష్ బాబు !! అట్లుంటది ఘట్టమనేని ఫ్యాన్స్‌ అంటే

Updated on: Apr 29, 2025 | 5:28 PM

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం సినిమాలతోనే కాదు తన సామాజిక సేవా కార్యక్రమాలతోనూ అందరి మన్ననలు అందుకుంటున్నాడీ సూపర్ స్టార్. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ ప‌డుతున్న చిన్నారుల‌కు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాడు.

ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 4500 మందిక పైగా పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించాడు మహేష్. దీంతో పాటు తన సొంతూరులో పలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడీ స్టార్ హీరో. ఇదే మహేష్ కు ఎనలేని అభిమానులను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఒక యువకుడు మహేష్ బాబు పట్ల వినూత్నంగా తన అభిమానాన్ని పంచుకున్నాడు. ఏకంగా తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటో ప్రింట్ చేసి ఊరంతా పంచిపెట్టాడు. కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తి మహేశ్ బాబుకు వీరాభిమాని. మహేశ్ బాబు ఫ్యాన్ క్లబ్‌లో చురుగ్గా ఉంటున్నాడు. మహేష్ బాబు సినిమా విడుదలైనా, పుట్టిన రోజైనా లేదా వేరే ప్రత్యేక సందర్భమేదైనా మహేశ్‌పై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి తన పెళ్లి కార్డుపై తన అభిమాన హీరో ఫొటో ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా మహేశ్ ఫ్యాన్స్ అంతా ఈ పెళ్లి కార్డును వైరల్ చేస్తున్నారు వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Vishnu: ప్రభాస్ పై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

Suriya: ప్రియదర్శికి స్టార్ హీరో సూర్య నుంచి షాకింగ్ గిఫ్ట్