Saif Ali Khan: ‘సైఫ్‌పై డౌట్‌గా ఉంది.. కత్తిపోట్లకు గురైనోడు 5 రోజుల్లో కోలుకుంటారా.?’

|

Jan 23, 2025 | 7:14 PM

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర మంత్రితో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సైఫ్‌పై నిజంగానే దాడి జరిగిందా.? కత్తిపోట్లతో గాయపడ్డ వాళ్లు 5 రోజుల్లో కోలుకుంటారా.?

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. అసలు సైఫ్‌పై దాడి జరిగిందా ? అన్న అనుమానాలు తమకు కలుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి నితేష్‌ రాణేతో పాటు పలువురు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నితేష్‌ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.. దాడి చేసిన బంగ్లాదేశ్‌ వ్యక్తి సైప్‌ అభిమాని అయివుంటాడని అన్నారు. ముందు ముంబైలో ఫుట్‌పాత్‌ మీద ఉండే బంగ్లాదేశీలు .. స్టార్‌ ఇళ్ల లోకి వస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రి నుంచి సైఫ్‌ డిశ్చార్జ్‌ సమయంలో అతడు నడిచిన తీరు చూస్తుంటే దాడి జరిగినట్టు లేదని , డాన్స్‌ చేసినట్టు ఉందని వ్యాఖ్యానించారు. సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగిన వెంటనే ఏమి జరిగిందో తెలియకుండా బాలీవుడ్‌ నటులు నానా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. వాళ్లకు విపక్ష నేతలు వంతపడుతున్నారని మండినడ్డారు నితేష్‌ రాణే.. సైఫ్‌ అలీ ఖాన్‌ , షారూఖ్‌ఖాన్‌కు చిన్న ప్రమాదం జరిగినా వెంటనే స్పందించే బాలీవుడ్‌ నటులు , విపక్ష నేతలు యువ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు.. బాలీవుడ్‌ నటుల ద్వంద్వ నీతికి ఇది నిదర్శనమన్నారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ కుటుంబానికి ఇప్పటికి కూడా న్యాయం జరగలేదన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Jan 23, 2025 07:00 PM