దిమ్మతిరిగే ఫోక్‌ సాంగ్‌తో.. కంబ్యాక్‌ ఇచ్చిన మాధురి రాథోడ్‌

Updated on: Oct 09, 2026 | 5:44 PM

తెలుగు జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మాధురి రాథోడ్‌ కొత్త ఫోక్‌ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బిందెలు బిందెలు బావయ్యో’ పాటకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఎప్పటిలాగే మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న ఆమె డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలిచిన మాధురి, ఈ కొత్త ఆల్బమ్‌తో మళ్లీ తన సంగీత, నృత్య ప్రయాణంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి పాట విడుదల కానుంది.

నిమ్మ తోట వనములో, సీటీ చీర, బాసింగ బలాలు.. ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ తో తెలుగు నాట మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మాధురి రాథోడ్ గత కొన్ని రోజులుగా తన పర్సనల్ ఇష్యూ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ కాస్త వెనక్కి వెళ్లి చూస్తే.. హైదరాబాద్ కి చెందిన మాధురి మోడల్ గా.., డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా.. అన్నిటికీ మించి జానపద నృత్యకారిణి గా మంచి పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ తో వార్తల్లో నిలిచే మాధురి రాథోడ్ ఈ మధ్యన ఇతర విషయాలతో వార్తల్లో నిలిచింది. తన తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తో ఒక గదిలో ఉన్నపుడు అతని భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా వీరిద్దరిని పట్టుకోవడం, ఆ తర్వాత ఈశ్వర్ సాయి అజ్ఞాతంలోకి వెళ్లడం, మాధురి రాథోడ్ ఈశ్వర్ పై ఛీటింగ్ కేసు పెట్టడం, చివరికి ఆమె ఆత్మహత్యాప్రయత్నం చేయడం.. ఇలా ఎన్నో సంఘటనలు తీవ్ర కలకలం రేపాయి. వీటిని చూసి మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కెరీర్లకు ఎండ్ కార్డ్ పడినట్టే చాలా మంది భావించారు. అయితే వీరిద్దరు ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కమ్ బ్యాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితమే ఓ ఫిల్మ్ ఈవెంట్‌లో ఈశ్వర్ సాయి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా తాను మళ్లీ బిజీ అవుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఇక తాజాగా మాధురి రాథోడ్ మరో కొత్త ఫోక్ సాంగ్ తో మన ముందుకు వచ్చింది. ‘బిందెలు బిందెలు బావయ్యో’ అనే జానపద పాటకు సంబంధించిన గ్లింప్స్ ని తాజాగా విడుదల చేసింది మాధురి. ఎప్పటిలాగే ఇందులోనూ ఫుల్ మాస్ ఎనర్జిటిక్ లెవెల్స్ తో డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మాధురీ రాథోడ్. త్వరలోనే ఈ ఆల్బమ్ సాంగ్ విడుదల చేయబోతున్నారు ఈ సాంగ్ క్రియేటర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: శివాజీ మహరాజ్‌ గడ్డపై.. ఐకాన్ స్టార్‌ సేవా కార్యక్రమం

Kangana Ranaut: ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి

నిన్ను తీసుకెళ్లిన ఆ దేవుడిని చంపాలనిపిస్తోంది! నానా మరణంతో ఆర్జీవీలో ఉప్పొంగిన భావోద్వేగం

నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

Aggipetta Macha Game: అగ్గిపెట్టె మచ్చా మీద.. ఏకంగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌ ఉంది తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us