ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్‌కు కూలీ చిత్రం భారీ ఎదురుదెబ్బ తగిలింది. రజనీకాంత్‌తో చేసిన ఈ ప్రయోగం విఫలమవడంతో, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఆయన భవిష్యత్ ప్రాజెక్టులపై సందేహాలు రేగుతున్నాయి. షెడ్యూల్ అయిన మల్టీస్టారర్, ఖైదీ 2 కూడా నిలిచిపోయాయి.
నేషనల్ సెన్సేషన్‌గా మారిన సౌత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కెరీర్ కూలీ చిత్రం ఫ్లాప్‌తో తిరగబడింది. ఎల్ సీ యూలో భాగంగా విజయ్, కమలహాసన్‌లతో బ్లాక్ బస్టర్‌లు అందించిన లోకేష్, రజనీకాంత్‌తో కూలీ చిత్రాన్ని ఎల్ సీ యూకు భిన్నంగా తెరకెక్కించారు. ఈ ప్రయోగం విఫలమవడంతో ఇది ఆయన కెరీర్‌లో తొలి డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తదుపరి ప్రాజెక్టులపై అనుమానాలు రేకెత్తాయి. కేష్ కనగరాజ్ మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో లోకేష్ మూవీ ఉంటుందన్న వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ, టాలీవుడ్ ఆడియన్స్ వీటిపై పెదవి విరుస్తున్నారు.
