Lokesh Kanagaraj: రజినీ – కమల్‌ కూడా పక్కన పెట్టేశారా ?? పాపం..లోకేష్‌!

Updated on: Sep 18, 2025 | 1:18 PM

లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే.. కోలీవుడ్‌ ఇండస్ట్రీకి మరో ట్యాలెంటెడ్ డైరెక్టర్ దొరికేశాడనే కామెంట్ యునానిమస్‌గా అన్ని వైపుల నుంచి వచ్చింది. విక్రమ్ సినిమా తర్వాత ఈ స్టార్ డైరెక్టర్‌తో వర్క్‌ చేసేందుకు మిగిలిన కోలీవుడ్ స్టార్ హీరోలందరూ వెంటపడే పరిస్థితి వచ్చింది. కానీ తన రీసెంట్‌ మూవీ కూలీ రిజె తో ఆ పరిస్థితి మారిపోయింది.

అమీర్ ఖాన్ మాత్రమే కాదు.. రజినీ – కమల్‌ కూడా ఈ స్టార్‌ డైరెక్టర్‌ ను పక్కన పెట్టేశారనే టాక్ ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించబోతున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కమల్.. స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అప్పటినుంచి ఈ మూవీ తీయబోయేది లోకేశ్ కనగరాజ్ అని రూమర్స్ మొదలయ్యాయి. అందరూ ఇది నిజమని అనుకున్నారు కూడా. కానీ లేటెస్ట్‌గా విమానాశ్రయంలో కనిపించిన రజినీకాంత్‌ని పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయం అడగ్గా.. కమల్‌తో మూవీ చేయబోతున్నానని చెప్పారు. కాకపోతే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పేశాడు. దీంతో లోకేష్‌ను కాకుండా… మరో డైరెక్టర్‌ వైపే కమల్, రజినీ మొగ్గు చూపిస్తున్నట్టు కోలీవుడ్‌లో ఓ టాక్ మొదలైంది. అంతేకాదు ఇక చేసేదేంలేక లోకేష్ కూడా.. ఖైదీ సీక్వెల్‌ పైకి తన ఫోకస్ షిఫ్ట్ చేసినట్టు మరో టాక్ కూడా కోలీవుడ్‌ నుంచి బయటికి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dil Raju: షార్ట్ ఫిల్మ్‌ల పోటీ.. గెలిస్తే రూ. 3 లక్షలు..

Manchu Manoj: మోహన్ బాబు కొడుకైతే ఏంటి? పాపం! మనోజ్‌కు ఇన్ని కష్టాలు.. కన్నీళ్లా..

ఛీ ఛీ.. కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌కు వెళ్లను.. ఆ పని చేయను!

Katrina Kai: తల్లి కాబోతున్న కత్రినా ?? గాలి వార్త కాదు కదా..!

బేరం కుదరకే.. బిగ్ బాస్‌పై చాడీలు.. ఒకప్పటి హీరోయిన్‌ ఓవర్ యాక్షన్