విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో
కోలీవుడ్ హీరో విశాల్ ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ వణుకుతూ..పూర్తిగా బక్కిచిక్కిపోయి కనిపించాడు. మాట్లాడేందుకు ఇబ్బందిపడుతూ.. సరిగ్గా చూడలేకపోయాడు. దీంతో విశాల్ ఆరోగ్య పరిస్థితిని చూసి ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. ఇదివరకే విశాల్ ఆరోగ్య పరిస్థితి పై నటి ఖుష్బూ మాట్లాడారు.
విశాల్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో జయం రవి స్పందించారు. తన తదుపరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. విశాల్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తారని జయం రవి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. విశాల్ మంచి మనసున్న వ్యక్తి.. ఎంతోమందికి సేవ చేశారు. ప్రస్తుతం అతడికి గడ్డుకాలం నడుస్తోంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు. సింహంలా గర్జిస్తారు అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: