బాలయ్యతో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ??

|

Jan 14, 2025 | 3:49 PM

సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా డాకు మహారాజ్. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాకు డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బాలయ్యతో పాటు.. ఈసినిమాలో చేసిన ఓచిన్నారి కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

ఆమె ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఇక డాకు మహారాజ్‌ సినిమాలో వైష్ణవి పాత్రలో కనిపించిన అమ్మాయి పేరు వేద అగర్వాల్. ఈ అమ్మాయి మల్టీ ట్యాలెంటెడ్. ఇన్ స్టాలో 31000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ పాపకు. ఇక ఆగ్రాకు చెందిన వేద అగర్వాల్ ఫ్యామిలీ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 8 సంవత్సరాలు. అంతకు ముందు గాండీవధారి అర్జున సినిమాలోనూ చిన్న పాత్ర పోషించింది. అలాగే సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. దీంతో తెలుగులో వేదకు మరిన్ని ఆఫర్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక డాకు మహారాజ్ షూటింగ్ చివరి రోజున వేద అగర్వాల్ ఎమోషనల్ అయిన వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. అందరూ వేద గురించి మాట్లాడుకేనేలా చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అభిమానులకు బాలయ్య ఫోన్‌.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్‌

Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. పోలీస్‌ స్టేషన్లో కేసు

పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!

ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్​ చేయాలి