రిలీజ్‌కు ముందే 50 కోట్లు కొల్లగొట్టిన కింగ్.. ??
ఓ సినిమాకు జనాల్లో క్రేజ్ పెరిగినా.. ఓ సినిమాపై మార్కెట్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయినా.. ఓటీటీ సంస్థలు ఆ సినిమా కోసం ఎగబడతాయి. ఆ సినిమా రైట్స్ కోసం పోటీపడతాయి. కోట్లకు కోట్ల డబ్బులు దారపోసి మరీ... ఆ సినిమా రైట్స్‌ను దక్కించుకుంటాయి. మేకర్స్ ముఖంలో ఆనందాన్ని నింపేస్తాయి. అంతేకాదు ఈ న్యూస్‌తో, ఆ సినిమాను నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తాయి.
ఓ సినిమాకు జనాల్లో క్రేజ్ పెరిగినా.. ఓ సినిమాపై మార్కెట్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయినా.. ఓటీటీ సంస్థలు ఆ సినిమా కోసం ఎగబడతాయి. ఆ సినిమా రైట్స్ కోసం పోటీపడతాయి. కోట్లకు కోట్ల డబ్బులు దారపోసి మరీ… ఆ సినిమా రైట్స్‌ను దక్కించుకుంటాయి. మేకర్స్ ముఖంలో ఆనందాన్ని నింపేస్తాయి. అంతేకాదు ఈ న్యూస్‌తో, ఆ సినిమాను నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తాయి. అచ్చంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దాదాపు 50 కోట్ల ధరకు కింగ్‌డమ్ ఓటీటీ రైట్స్ అమ్ముడు పోవడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఫ్రెటర్నిటీలో సెన్సేషన్ గా మారింది. కల్కిలో అర్జున క్యారెక్టర్ చేసి… సిల్వర్ స్క్రీన్ పై అభినవ అర్జునుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కింగ్ డమ్ సినిమాలో సూరిగా నటిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే అనౌన్స్‌మెంట్ నుంచే మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ… రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్‌తో… ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో అటు యూఎస్‌ఏలోనూ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. థియెట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాకుండానే కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఓ టాక్ బయటికి వచ్చింది. ఈ మూవీ కంటెంట్.. అండ్ బజ్ నచ్చడంతో ఓటీటీ ఫీల్డ్‌లో పోటీ ఏర్పడిందని టాక్. అయితే ఈ పోటీలో 50 కోట్ల బిడ్డింగ్‌తో… నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ను సొంతం చేసుకుందని ఇన్ సైడ్ న్యూస్. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జులై 31న ఈ మూవీ రిలీజ్ కానున్న వేళ… కింగ్ డమ్ పై ఫిల్మ్ లవర్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పెషల్ లేడీతో మహేష్ మాస్ స్టెప్పులు.. కుర్చీని తిరగేసే ప్లాన్ చేస్తున్న జక్కన్న
‘గోదారి గట్టు’ సాంగ్‌ను మించేలా.. చిరుతో నయన్ రొమాంటిక్ సాంగ్