Sunny Mahipal: గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! గర్భ విచ్ఛిత్తి ఫిర్యాదు..

|

Jul 27, 2024 | 5:05 PM

కర్నాటకలో హీరో దర్శన్ కేసు మరవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఓ బుల్లి తెర నటుడు రెచ్చిపోయాడు. విచక్షణ మరిచి గర్బిణిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసాడు. రెండో వివాహం వద్దని అడ్డుకున్నందుకు సన్నీమహిపాల్‌ కత్తితో పొడిచాడని ఆయన భార్య HAL పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త తనపై దాడి చేయడంతో గర్భ విచ్ఛిత్తి జరిగిందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వాపోయింది.

సన్నీ మహిపాల్‌ ‘నేత్రావతి’ అనే సీరియల్‌తో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు పరిచయమైన యువతులతో సహజీవనం చేసేవాడన్న ఆరోపణలున్నాయి. న్యాయ కళాశాలలో చదువుతున్న సమయంలో తనకు పరిచయమైన సన్నీ మహిపాల్‌ను ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నానని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం మరో యువతితో వివాహానికి సిద్ధమైన విషయం తెలుసుకుని నిశ్చితార్థం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి, అతన్ని అడ్డుకోవడంతో కత్తితో పొడిచాడని ఆరోపించింది. బాధితురాలిని చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడికి ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సన్నీ మహిపాల్‌.

రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్‌ హీరో దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా ఉండటం వల్ల అతను నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు పూర్తి కావచ్చిన డెవిల్‌ సినిమా షూటింగ్‌ ఇప్పుడు అర్దాంతరంగా ఆగిపోయింది. అయితే, దర్శన్ జైల్లో ఉండగానే ‘డెవిల్‌’ సినిమా షూటింగ్ లో పాల్గొనవచ్చా అనే చర్చ కన్నడ చిత్రసీమలో జరుగుతోంది. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ ఉదంతాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.